న్యూఢిల్లీ: రాబోయే ఏడాది వ్యవధిలో హైదరాబాద్‌లో మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) రానున్నట్లు పరిశ్రమ సమాఖ్య ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం ప్రస్తుతం సుమారు 515 జీసీసీలు ఉన్నాయి. వీటిలో 3 లక్షల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలోని మొత్తం జీసీసీల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
నగరంలో ఆఫీస్ మార్కెట్ డిమాండ్‌కి జీసీసీలు కీలకమైన చోదకాలుగా మారాయని నివేదిక వివరించింది. విదేశీ సంస్థలు నెలకొల్పే జీసీసీలు 2021లో 19 లక్షల చ.అ.ల ఆఫీస్ స్పేస్ తీసుకోగా 2025లో ఇది 45 లక్షల చ.అ.లకు పెరిగింది. జీసీసీల దన్నుతో ఐటీ–ఐటీఈఎస్‌ని దాటి హైదరాబాద్ పరిధి పెరుగుతోందని ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వి.వి. రామ రాజు తెలిపారు.


