స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | stock market updates on febraury 21 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Feb 21 2025 9:39 AM | Updated on Feb 21 2025 11:04 AM

stock market updates on febraury 21 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:35 సమయానికి నిఫ్టీ(Nifty) 23 పాయింట్లు నష్టపోయి 22,891కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 75 పాయింట్లు దిగజారి 75,658 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 106.4 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 76.45 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.49 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.43 శాతం నష్టపోయింది. నాస్‌డాక్‌ 0.47 శాతం పడిపోయింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ వాణిజ్య విధానాలతో నెలకొన్న అనిశ్చితుల మధ్య చోటుచేసుకునే అంతర్జాతీయ పరిణామాలపైకి ఇన్వెస్టర్ల దృష్టి మళ్లొచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటికి అదనంగా డాలర్‌తో రూపాయి తీరు, బ్రెండ్‌ క్రూడ్‌ ధరలు సైతం ప్రభావం చూపించొచ్చని భావిస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, కరెన్సీ మారకంపై మార్కెట్‌ దృష్టి సారించొచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ఎలాంటి ముఖ్యమైన సంకేతాలు లేకపోవడంతో అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌ తీరును నిర్ణయించొచ్చని చెబుతున్నారు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement