
గురువారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటలకు సెన్సెక్స్ 205.81 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 82,324.93 వద్ద, నిఫ్టీ 45.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 25,016.15 వద్ద ముందుకు సాగుతున్నాయి.
బియర్డ్‌సెల్, జీ లెర్న్, వాన్‌బరీ, శివమ్ ఆటోటెక్, రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, న్యూలాండ్ లాబొరేటరీస్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).