జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు | Stock Market Rally On Today Opening | Sakshi
Sakshi News home page

జీవితకాల గరిష్ఠాలను చేరిన స్టాక్‌మార్కెట్లు

Jul 29 2024 9:48 AM | Updated on Jul 29 2024 10:04 AM

Stock Market Rally On Today Opening

దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:41 సమయానికి నిఫ్టీ 75 పాయింట్లు పెరిగి 24,911కు చేరింది. సెన్సెక్స్‌ 329 పాయింట్లు పుంజుకుని 81,658 వద్ద ట్రేడవుతోంది. దీంతో మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుకున్నాయి.

అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 104.33 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 81.44 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.18 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 1.11 శాతం, నాస్‌డాక్‌ 1.03 శాతం  లాభపడ్డాయి.

కీలక వడ్డీరేట్లపై బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. యూరోజోన్‌ జీడీపీ డేటా(మంగళవారం), చైనా తయారీ రంగ గణాంకాలు బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాడ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు(గురువారం), అమెరికా ఉద్యోగాల డేటా ట్రేడింగ్‌కు ప్రభావితం చేయొచ్చు. దేశీయంగా జులై నెలకు సంబంధించి గురువారం(ఆగస్టు 1న) దేశీయ ఆటో కంపెనీల అమ్మకాల డేటా, తయారీ రంగ పీఎంఐ గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించవచ్చు.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement