సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు | Stock Market Rally Today Opening (February 9, 2024) - Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు

Feb 9 2024 9:32 AM | Updated on Feb 9 2024 9:44 AM

Stock Market Rally Today Opening - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు శుక్రవారం స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 21,743 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 29 పాయింట్లు లాభపడి 71,458 వద్ద ట్రేడవుతోంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎం అండ్‌ ఎం, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, మారుతి సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement