ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి! | Stock Market Rally On Today Closing on November 12, 2024 | Sakshi
Sakshi News home page

ఒకే రోజు రూ.4.3 లక్షల కోట్లు ఆవిరి!

Nov 12 2024 3:51 PM | Updated on Nov 12 2024 3:52 PM

Stock Market Rally On Today Closing on November 12, 2024

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిసాయి. మార్కెట్‌ ప్రారంభంలో కాసేపు లాభాల్లో కదలాడిన సూచీలు ముగింపు సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 257 పాయింట్లు నష్టపోయి 23,883 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 820 పాయింట్లు దిగజారి 78,675 వద్ద ముగిసింది. దాంతో ఈక్విటీ మార్కెట్‌లో ఒక్కరోజే దాదాపు రూ.4.3 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది.

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇటీవల దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల్లో ముగుస్తున్నాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ మానిటరీ పాలసీ మీటింగ్‌లో భాగంగా 25 బేసిస్‌ పాయింట్లు కీలక వడ్డీరేట్లలో కోత విధించింది. అయితే శుక్రవారం ఫెడ్‌ ఛైర్మన్‌ జెరొమ్‌ పావెల్‌ యూఎస్‌ ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ఫెడ్‌ మినట్స్‌ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కంపెనీ స్టాక్‌లు లాభాల్లోకి చేరుకున్నాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, మారుతీ సుజుకీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement