సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Stock Market Rally On Today Closing | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Apr 25 2024 6:18 PM | Updated on Apr 25 2024 6:18 PM

Stock Market Rally On Today Closing - Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 45 పాయింట్లు లాభపడి 22,413 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు ఎగబాకి 73,869 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్‌, కోటక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌ అండ్‌ టీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్ ఫార్మా కంపెనీ షేర్లు లాభాలతో ముగిశాయి.      

టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్, టైటాన్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్, విప్రో, మారుతీ సుజుకీ, హిందుస్థాన్‌ యూనిలీవర్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement