
భారతీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీలు ఈ వారం చివరి ట్రేడింగ్ సెషన్‌ను నష్టాలతో ముగించాయి. ఇన్వెస్టర్లు అధిక స్థాయిలో లాభాల నమోదుకు పరుగులు తీయడంతో సూచీలకు నష్టాలు తప్పలేదు.
శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 200.15 పాయింట్లు లేదా 0.24 శాతం క్షీణించి 82,330.59 వద్ద ముగిసింది. ఈ సూచీ ఈరోజు 82,514.81 నుంచి 82,146.95 మధ్య ట్రేడ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 42.30 పాయింట్లు లేదా 0.17 శాతం క్షీణించి 25,019.80 వద్ద స్థిరపడింది.
విస్తృత మార్కెట్లు బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. స్మాల్ క్యాప్ షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు వరుసగా 1.86 శాతం, 0.94 శాతం లాభాలతో ముగిశాయి.
సెన్సెక్స్ షేర్లలో హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు 1.20 శాతం నుంచి 0.60 శాతం మధ్య లాభపడ్డాయి. అదేసమయంలో భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు 2.76 శాతం నుంచి 0.79 శాతం మధ్య నష్టపోయాయి.