సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అప్‌ | South Indian Bank Net profit rises 18percent to Rs 325 crore in Q2 results | Sakshi
Sakshi News home page

సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ లాభం అప్‌

Oct 17 2024 1:19 AM | Updated on Oct 17 2024 8:11 AM

South Indian Bank Net profit rises 18percent to Rs 325 crore in Q2 results

క్యూ2లో రూ. 325 కోట్లు  

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో నికర లాభం 18 శాతం ఎగసి రూ. 325 కోట్లను తాకింది. ట్రెజరీ, ఫారెక్స్‌ ఆర్జన రెట్టింపై రూ. 106 కోట్లకు చేరుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 275 కోట్ల లాభం సాధించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,485 కోట్ల నుంచి రూ. 2,804 కోట్లకు బలపడింది.

 వడ్డీ ఆదాయం రూ.2,129 కోట్ల నుంచి రూ. 2,355 కోట్లకు మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 9 శాతం వృద్ధితో రూ. 882 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 3.24 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 4.96 శాతం నుంచి 4.4 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.7 శాతం నుంచి  1.31 శాతానికి దిగివచ్చాయి. ప్రొవిజన్లు రెట్టింపై రూ. 116 కోట్లను తాకాయి. కనీస మూలధన నిష్పత్తి 18.04 శాతాన్ని తాకింది. ఫలితాల నేపథ్యంలో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌  షేరు బీఎస్‌ఈలో 6.5 శాతం జంప్‌చేసి  రూ. 25.5 వద్ద ముగిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement