ఈ డాక్యుమెంట్‌ కెమెరాతో ఆన్‌లైన్‌ క్లాస్‌ ఈజీ.. | Smart gadgets for teachers | Sakshi
Sakshi News home page

ఈ డాక్యుమెంట్‌ కెమెరాతో ఆన్‌లైన్‌ క్లాస్‌ ఈజీ..

Jul 6 2025 2:55 PM | Updated on Jul 6 2025 3:18 PM

Smart gadgets for teachers

టీచర్లు టెక్‌తో టచ్‌లోకి రావాలన్నా, విద్యార్థులు విజ్ఞానంలో విండో ఓపెన్‌ చేయాలన్నా.. వారి వద్ద ఈ టెకీ టూల్‌ మాస్టార్లు ఉండాల్సిందే!

క్లాస్‌లో స్క్రీన్‌ స్టార్‌
ఆన్‌లైన్‌ క్లాసుల్లో విద్యార్థులు బయటకు కనబడేలా భయపడితే, టీచర్లు లోలోపల భయపడుతుంటారు. ఎందుకంటే ముందే పీపీటీలు సిద్ధం చేయకపోతే, ‘సార్, స్క్రీన్‌ షేర్‌ చేయండి’, ‘మిస్, స్లయిడ్‌ మిస్‌ అయింది’ అంటూ సందేశాల వర్షం కురిపిస్తారు విద్యార్థులు. ఇక నెట్‌ స్లో, లైట్‌ తక్కువ, ఫాంట్‌ చిన్నది లాంటి ఇతర సమస్యలతో ఆన్‌లైన్‌ క్లాస్‌ మొత్తం గాలిలో కలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్లకు తోడుగా ఉండే నేస్తమే ఈ ‘డాక్యుమెంట్‌ కెమెరా’. దీని ముందు పుస్తకం పెడితే చాలు, స్పష్టంగా సమాచారాన్ని స్క్రీన్‌పై చూపిస్తుంది. టచ్‌ చేస్తే లైట్‌ వెలుగుతుంది, బటన్‌ నొక్కితే బ్లర్‌ లేకుండా చూసుకుంటుంది. మీరు పేజీ తిప్పితే ఇది కూడా తిప్పి చూపిస్తుంది. స్లయిడ్స్‌ అవసరం లేకుండా బుక్‌తోనే క్లాస్‌ పూర్తవుతుంది. ధర రూ. 2,999.

ఆర్ట్‌ మాస్టర్‌!
పిల్లలు బొమ్మలు గీస్తారు, కట్‌ చేస్తారు, స్టిక్‌ చేస్తారు. ఇలా చేస్తూ చేస్తూ చివరకు చేతికి బ్యాండేజ్‌ వేసుకుంటారు! ఇలాంటి చిన్న చిన్న గాయాలకు ఇకపై ఈ ‘స్కాన్‌ అండ్‌ కట్‌’ మెషిన్‌ గుడ్‌బై చెప్తుంది. బొమ్మ చూపిస్తే, ఏ మెటీరియల్‌పై అయినా కట్‌ చేయగలదు. కాగితం, ఫ్యాబ్రిక్, ఫోమ్‌.. ఏదైనా సరే, స్క్రీన్‌ మీద టచ్‌ చేస్తే చాలు, రెండు వందలకు పైగా రెడీ డిజైన్‌లతో సిద్ధంగా ఉంటుంది. ఒక్క క్లిక్‌తో కావాల్సిన ఆర్ట్‌ని రెడీ చేసి ఇస్తుంది. ఇది కేవలం కటింగ్‌ మెషిన్‌ కాదు. స్కానింగ్, డిజైనింగ్, కటింగ్‌ అన్నీ కలిపిన ఒక క్రాఫ్ట్‌ మాస్టర్‌. ఇంట్లోనైనా, క్లాస్‌రూమ్‌లోనైనా ఒక్కసారి పెట్టి చూడండి. అప్పుడు చిన్న చేతులు పెద్ద ఆర్ట్‌ చేయడం చూస్తారు. ధర రూ. 22,000.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement