సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు | Sensex And Nifty 50, Ended Session Flat | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ సూచీలు

Feb 7 2024 3:55 PM | Updated on Feb 7 2024 4:11 PM

Sensex And Nifty 50, Ended Session Flat - Sakshi

దేశీయ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. యూఎస్‌ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలు రావడం, విదేశీ మదుపరులు సైతం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే  దేశీయ సూచీలపై ఐటి షేర్లు ప్రభావం చూపినప్పటికీ, ఫైనాన్షియల్, రియల్టీ స్టాక్స్ పురోగతికి దారితీశాయి.

బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72152 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా ఒక పాయింట్‌ లాభంతో మార్కెట్‌కు ముగింపు పలికాయి. 

ఇక ఎస్‌బీఐ, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే, ఏసియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా..టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలతో మార్కెట్‌కు ముగింపు పలికాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement