
రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఆ సంస్థ ప్రమోటర్ అనిల్ అంబానీని ‘మోసపూరితం(ఫ్రాడ్)’గా ఎస్‌బీఐ జూన్ 13న గుర్తించినట్టు లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పకంజ్ చౌదరి తెలిపారు. జూన్ 24న ఆర్‌బీఐకి ఫ్రాడ్ వర్గీకరణ గురించి ఎస్‌బీఐ నివేదించిందని.. దీనిపై సీబీఐ వద్ద కేసు దాఖలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
ఇదీ చదవండి: జేన్ స్ట్రీట్‌పై సెబీ నిషేధం ఎత్తివేత
ఫ్రాడ్‌గా గుర్తించిన విషయాన్ని ఆర్‌కామ్ బీఎస్‌ఈకి జూలై 1న వెల్లడించడం గమనార్హం. ఆర్‌కామ్ ప్రస్తుతం దివాలా పరిష్కార చట్టం కింద చర్యలను ఎదుర్కొంటోంది. ఆర్‌కామ్, దాని అనుబంధ సంస్థలు వివిధ బ్యాంకుల నుంచి రూ. 31వేల కోట్లకు పైగా రుణం తీసుకోగా.. ఈ నిధులను వివిధ గ్రూప్ సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని ఎస్‌బీఐ ఆర్‌కామ్‌కు తెలియజేయడం గమనార్హం.