సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్ | Sakshi
Sakshi News home page

సైనా నెహ్వాల్ గ్యారేజిలో చేరిన కొత్త అతిథి - వీడియో వైరల్

Published Tue, Nov 21 2023 2:52 PM

Saina Nehwal New Mercedes AMG GLE 53 SUV Details - Sakshi

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ 'సైనా నెహ్వాల్' ఇటీవల తన గ్యారేజిలో ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని చేర్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సైనా నెహ్వాల్ కొన్న కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'AMG GLE 53 4MATIC+ Coupe'. దీని ధర రూ.1.8 కోట్లు. బాలీవుడ్ నటి సుస్మితా సేన్ తరువాత ఈ కారుని కొన్న వ్యక్తి 'సైనా నెహ్వాల్' కావడం విశేషం. కారు డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఈమె తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చేసింది.

మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ
దేశీయ మార్కెట్లో ఖరీదైన కార్ల జాబితాలో ఒకటైన 'మెర్సిడెస్ ఏఎంజీ జీఎల్ఈ' మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 3.0 లీటర్ 6 సిలిండర్ ఇన్‌లైన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌ ఉంటుంది. ఇంజన్ గరిష్టంగా 435 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు 5.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 249 కిమీ.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు 12.3 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం, మరొకటి డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. వీటితో పాటు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టమ్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తాయి.

 
Advertisement
 
Advertisement