రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి 750సీసీ బైక్‌ | Royal Enfield Himalayan 750 Launched Price Bookings December 1 | Sakshi
Sakshi News home page

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి తొలి 750సీసీ బైక్‌

Nov 28 2026 3:35 PM | Updated on Nov 28 2026 3:39 PM

Royal Enfield Himalayan 750 Launched Price Bookings December 1

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ‘హిమాలయన్‌ 750’ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. తద్వారా సంస్థ 750సీసీ అడ్వెంచర్‌ టూరింగ్‌ విభాగంలోకి అడుగుపెట్టినట్లయింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి వస్తున్న తొలి 750సీసీ బైక్‌ కూడా ఇదే. చెన్నై ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధర రూ.4.89 లక్షలుగా ఉంది.


దేశవ్యాప్తంగా డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి బుకింగ్‌లు ప్రారంభం అవుతాయి. క్యాస్ట్‌ వీల్స్, స్పోక్‌ వీల్స్, ఫ్లాగ్‌షిప్‌ అంటార్కిటిక్‌ సిల్వర్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఇందులో 743సీసీ ఎయిర్‌ ఆయిల్‌–కూల్డ్‌ ప్యార్లల్‌ ట్విన్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 5,000 ఆర్‌పీఎం వద్ద 63 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రోడ్, రోడ్‌ స్పోర్ట్, రెయిన్, ట్రయల్, కస్టమ్‌ అనే అయిదు రైడింగ్‌ మోడ్‌లు ఉన్నాయి.


ఇంటిగ్రేటెడ్‌ నావిగేషన్, కనెక్టివిటీతో వృత్తాకార టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. క్రూయిజ్‌ కంట్రోల్, టైర్‌ ప్రెజర్‌ మానిటరింగ్‌ సిస్టమ్, ఏడు అంగుళాల ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ ఉన్నాయి. టూరింగ్‌ సౌకర్యాలకు అనుగుణంగా 17 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్, 205 ఎంఎం గ్రౌండ్‌ క్లియరెన్స్, 815 ఎంఎం సీటు ఎత్తు, 195 కిలోల పేలోడ్‌ సామర్థ్యం, అడ్జస్టబుల్‌ విండ్ర్‌స్కీన్‌ ఇందులో ఉన్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement