హిమాలయన్ 440 లాంచ్: ధర ఎంతంటే? | Royal Enfield Himalayan 440 Launched at Rs 2 29 Lakh | Sakshi
Sakshi News home page

హిమాలయన్ 440 లాంచ్: ధర ఎంతంటే?

Sep 4 2026 8:05 PM | Updated on Sep 4 2026 8:36 PM

Royal Enfield Himalayan 440 Launched at Rs 2 29 Lakh

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440 భారతదేశంలో రూ. 2.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద లాంచ్ అయింది. స్క్రామ్ 440 తర్వాత, హిమాలయన్ 440 అనేది 440 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడిన రెండవ బైక్. ఇది మూడు రంగులలో లభిస్తుంది. దీనికోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

హిమాలయన్ 440 బైక్ 443 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6,250rpm వద్ద 25.4 bhp పవర్, 4,000rpm వద్ద 34Nm టార్క్‌ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్ జత చేయబడింది. ఇది హాఫ్-డ్యూప్లెక్స్ స్ప్లిట్ క్రాడిల్ ఫ్రేమ్‌పై నిర్మించబడి.. టెలిస్కోపిక్ ఫోర్క్ పొందుతుంది.

ఫీచర్ల విషయానికి వస్తే.. కొత్త హిమాలయన్ 440లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంది. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్‌తో పాటు, ఫ్యూయెల్ లెవెల్, టైమ్, ట్రిప్, ఓడోమీటర్ రీడ్‌అవుట్‌ల కోసం ఒక డిజిటల్ ఇన్‌సెట్ కూడా ఉంది. అంతేకాకుండా.. టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రిప్పర్ నావిగేటర్ మాడ్యూల్ కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement