
న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ లైఫ్‌స్టయిల్ బ్రాండ్ టోడ్స్ ఎస్‌పీఏతో రిలయన్స్ బ్రాండ్స్ (ఆర్‌బీఎల్) దీర్ఘకాలిక ఫ్రాంచైజీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం భారత మార్కెట్లో టోడ్స్ ఉత్పత్తులకు (పాదరక్షలు, హ్యాండ్ బ్యాగ్‌లు, యాక్సెసరీలు మొదలైనవి) ఆర్‌బీఎల్ అధికారిక రిటైల్ విక్రేతగా ఉంటుంది. అలాగే టోడ్స్‌కి ప్రస్తుతం భారత్‌లో ఉన్న స్టోర్స్ మేనేజ్‌మెంట్‌ను టేకోవర్ చేస్తుంది.
2008 నుంచి టోడ్స్ భారత్‌లో న్యూఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో మోనో–బ్రాండ్ స్టోర్స్ ఉన్నాయి. అజియో లగ్జీ మల్టీ బ్రాండ్ ఈ–కామర్స్ ప్లాట్‌ఫారం ద్వారా కూడా విక్రయాలు సాగిస్తోంది. మిలన్ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టయిన టోడ్స్‌కి ప్రపంచవ్యాప్తంగా 318 సొంత స్టోర్స్, 88 ఫ్రాంచైజీ స్టోర్స్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్)కి చెందిన రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ అనుబంధ సంస్థ ఆర్‌బీఎల్. 2007లో కార్యకలాపాలు ప్రారంభించింది.