జియో వినియోగదారుల కోసం రూ.149తో జియోహాట్‌స్టార్ డేటా ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 30 రోజులు. ఇందులో మొత్తం 10జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే.. ప్యాక్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత 30 రోజుల వ్యవధిలో 10జీబీ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్యాక్‌లో మరో ప్రత్యేక ప్రయోజనం 90 రోజుల జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్. దీంతో జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మొబైల్‌లో వీక్షించేందుకు 90 రోజుల సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. ముఖ్యంగా జియోహాట్‌స్టార్ కంటెంట్‌ను ఎక్కువగా చూసేవారికి, డేటా అవసరం ఉన్న జియో యూజర్లకు ఈ ప్యాక్ ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. ఈ రూ.149 ప్యాక్‌లో వాయిస్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్ ప్రయోజనాలు ఉండవు. ఇది పూర్తిగా డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనాల కోసం మాత్రమే. కాబట్టి కాలింగ్, ఎస్ఎమ్ఎస్ కోసం ప్రత్యేకంగా యాక్టివ్ ప్లాన్ ఉండాల్సి ఉంటుంది.
కాగా.. 10GB హై-స్పీడ్ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోవు. ఆ తర్వాత డేటా వేగం 64 Kbpsకు తగ్గుతుంది. అందువల్ల ఎక్కువ డేటా వినియోగించే వారికి ఇది ప్రధానంగా డేటా యాడ్-ఆన్‌గా ఉపయోగపడుతుంది. మొత్తం మీద రూ.149కు 10GB డేటా + 90 రోజుల ఎస్ఎమ్ఎస్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభించడం ఈ ప్యాక్‌లో ప్రధాన ఆకర్షణ.


