12 నిమిషాల్లో 97 శాతం ఛార్జ్.. BYD కొత్త టెక్నాలజీ! | BYD Says EV Can Charge From 97 Percent In 12 Minutes At Minus 30 Degree Celsius | Sakshi
Sakshi News home page

12 నిమిషాల్లో 97 శాతం ఛార్జ్.. BYD కొత్త టెక్నాలజీ!

Sep 10 2026 7:59 PM | Updated on Sep 10 2026 8:14 PM

BYD Says EV Can Charge From 97 Percent In 12 Minutes At Minus 30 Degree Celsius

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ కొత్త ఫ్లాష్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రకటించింది. కంపెనీ ప్రకారం, -30 డిగ్రీల సెల్సియస్ వంటి తీవ్రమైన చలిలోనూ ఈవీ బ్యాటరీని 20 శాతం నుంచి 97 శాతం వరకు, కేవలం 12 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. సాధారణ ఉష్ణోగ్రతల్లో 10 శాతం నుంచి 97 శాతం వరకు 9 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని బీవైడీ చెబుతోంది.

బీవైడీ తన ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తోంది. ఆగస్టు 28, 2026 నాటికి చైనాలో 10,000 ఫ్లాష్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ నెట్‌వర్క్ ప్రస్తుతం.. 332 నగరాల్లో అందుబాటులో ఉంది. 2026 చివరి నాటికి ఈ సంఖ్యను 20,000 స్టేషన్లకు పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఫ్లాష్ ఛార్జింగ్ సిస్టమ్ గరిష్ఠంగా 1,500 కిలోవాట్ వరకు ఛార్జింగ్ పవర్ అందించగలదని బీవైడీ వెల్లడించింది. అయితే.. వాస్తవ ఛార్జింగ్ వేగం ప్రతి వాహనం బ్యాటరీ, ఛార్జింగ్ సిస్టమ్, ఉష్ణోగ్రత, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

ఈవీలలో ఎక్కువ సమయం తీసుకునే ఛార్జింగ్ ప్రక్రియను తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా కంపెనీల మధ్య పోటీ పెరుగుతున్న సమయంలో బీవైడీ ఈ టెక్నాలజీని తీసుకొచ్చింది. ముఖ్యంగా.. చలికాలంలో బ్యాటరీ పనితీరు తగ్గే సమస్యను అధిగమించగలిగితే, అత్యంత చల్లని ప్రాంతాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత సులభతరం చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం BYD స్వయంగా నిర్వహించిన పరీక్షల ఆధారంగా వెల్లడించిన గణాంకాలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement