ఆకాష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్‌

Reliance Jio Chairman Akash Ambani Launched 5g Wi Fi Services In India - Sakshi

జియో యూజర్లకు బంపరాఫర్‌. 5జీ నెట్‌ వర్క్‌ సదుపాయం లేకున్నా.. 5జీ వైఫైని వినియోగించుకునే సౌకర్యాన్ని రిలయన్స్‌ జియో తన యూజర్లకు కల్పించింది. 

దీపావళి సందర్భంగా జియో ట్రూ 5జీ నెట్‌ వర్క్‌ను ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలలో అందుబాటులోకి తెస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో మిగిలిన ప్రాంతాలకు చెందిన యూజర్లను ఇతర 5జీ నెట్‌ వర్క్‌ల వైపు (ఇప్పటికే ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులో ఉంది) మొగ్గు చూపకుండా ఉండేందుకు జియో​ ఛైర్మన్‌ ఆకాష్‌ అంబానీ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. 

జియో ఎంపిక చేసిన ప్రాంతాల్లో జియో 5జీ వైఫైను విడుదల చేసింది. 5జీ స్మార్ట్‌ ఫోన్‌, 5జీ సిమ్‌ లేని యూజర్లు ఏ స్మార్ట్‌ఫోన్‌లలో అయినా ఈ  5జీ వైఫై సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. ఈ ఫాస్టెస్ట్‌ నెట్‌వర్క్‌ వైఫైని ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌,రైల్వే స్టేషన్స్‌, బస్టాండ్‌, కమర్షియల్‌ హబ్స్‌ తోపాటు జియో 5జీ నెట్‌ వర్క్‌ అందుబాటులోకి రానున్న ఢిల్లీ,ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ఉపయోగించుకునే సౌకర్యాన్ని రిలయన్స్‌ కల్పించింది. 

‘5జీ అనేది అతి కొద్దిమందికి లేదా, పెద్ద పెద్ద నగరాల్లోని కస్టమర్లకి మాత్రమే కాదు. ప్రతి దేశ పౌరుడికి, ప్రతి ఇంటికి, భారతదేశం అంతటా ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉండాలి. జియో ట్రూ 5జీని ప్రతి భారతీయుడికి ఉపయోగించుకునేలా ఇది ఒక అడుగు’ మాత్రమే అని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ జియో 5జీ వైఫై విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, జియో ట్రూ 5జీ టెస్టింగ్ చెన్నైలో సైతం నిర్వహించింది. దీంతో దీపావళికి జియో 5జీ అందుబాటులోకి రానున్న ప్రాంతాల్లో చెన్నైకి స్థానం లభించింది. 

ఈ ఫోన్‌లలో 5జీ సేవలు 
యాపిల్,శాంసంగ్‌ గూగుల్ వంటి ప్రధాన ఫోన్ తయారీదారులు రాబోయే రెండు నెలల్లో 5జీ రెడీ ఓటిఎ (ఓవర్-ది-ఎయిర్) అప్ డేట్లను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1 లాంచ్ చేసింది. ఇది జియో ట్రూ 5 జీకి సపోర్ట్‌ చేసిన ఫోన్‌ల జాబితాలో మొదటి స‍్థానాన్ని సంపాదించుకుంది.

చదవండి👉 దేశంలో జియో 5జీ సేవలు ప్రారంభం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top