ఆర్‌బీఐ నిర్ణయం.. హోమ్‌లోన్‌ ఈఎంఐ పెంపు! | RBI Repo Rate Hike - Will Your Home, Car Loan EMIs Rise? Explained! | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ నిర్ణయం.. హోమ్‌లోన్‌ ఈఎంఐ పెంపు!

Oct 7 2026 10:13 AM | Updated on Oct 7 2026 11:03 AM

RBI Repo Rate Hike - Will Your Home, Car Loan EMIs Rise? Explained!

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయం రుణగ్రహీతల్లో ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్‌ 5 నుంచి 7 వరకు సమావేశమైన ద్రవ్య విధాన కమిటీ (ఎంసీపీ) నిర్ణయాన్ని ఆర్‌బీఐ ఈరోజు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతున్నట్లు తెలిపింది. దాంతో రెపో 5.5కు చేరింది. దీని ప్రభావం ముఖ్యంగా రెపోతో అనుసంధానమైన ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలపై పడుతుంది. బ్యాంకులు తమ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేట్లను పెంచితే గృహ, వాహన రుణాల వడ్డీభారం పెరుగుతుంది.

గృహరుణం ఎలా మారుతుందో చూద్దాం..

రూ.50 లక్షల గృహ రుణాన్ని 20 ఏళ్లకు 8.5% వడ్డీతో తీసుకున్నారని అనుకుందాం. నెలకు ఈఎంఐ సుమారు రూ.43,391 అవుతుంది. వడ్డీరేటు 0.25 శాతం పెరిగి 8.75% అయితే, అదే కాలవ్యవధిలో ఈఎంఐ సుమారు రూ.44,186కు చేరుతుంది. అంటే నెలకు దాదాపు రూ.795 అదనపు భారం. అయితే వాస్తవ ప్రభావం బ్యాంకు రుణ రేటు, మిగిలిన కాలవ్యవధి, రుణగ్రహీత ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటుంది. వాహన రుణాలపైనా ఇదే విధమైన ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు రూ.10 లక్షల రుణాన్ని ఐదేళ్లకు తీసుకుంటే రేటు పెంపు మేరకు నెలవారీ చెల్లింపు పెరుగుతుంది.

అయితే రేటు పెరిగిన ప్రతిసారీ ఈఎంఐ తప్పనిసరిగా పెరగాల్సిన అవసరం లేదు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రుణగ్రహీతకు ఈఎంఐ పెంపు, రుణకాలం పొడిగింపు లేదా రెండింటి కలయిక వంటి ఆప్షన్స్‌ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఫ్లోటింగ్‌ నుంచి ఫిక్స్‌డ్‌ రేటుకు మారే అవకాశం, పాక్షిక లేదా పూర్తి ముందస్తు చెల్లింపు సదుపాయం కూడా ఉంటుంది.

ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్‌బీఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement