బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా | RBI Imposes Penalty On SBI Indian Bank Punjab and Sind Bank | Sakshi
Sakshi News home page

RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా

Sep 25 2023 8:33 PM | Updated on Sep 25 2023 8:39 PM

RBI Imposes Penalty On SBI Indian Bank Punjab and Sind Bank - Sakshi

వివిధ నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌తో సహా ఓ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థపై చర్యలు తీసుకున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది .

ఏ బ్యాంకుకు ఎంత జరిమానా?
'రుణాలు, అడ్వాన్సులు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు' అలాగే 'ఇంట్రా-గ్రూప్ లావాదేవీలు, ఎక్స్‌పోజర్‌ల నిర్వహణపై మార్గదర్శకాలు' గురించి ఆర్బీఐ జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు ఎస్‌బీఐకి రూ. 1.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

'రుణాలు, అడ్వాన్స్‌లు: చట్టబద్ధమైన, ఇతర పరిమితులు', కేవైసీ మార్గదర్శకాలు, 'ఆర్బీఐ (డిపాజిట్లపై వడ్డీ) మార్గదర్శకాలు-2016'ను ఉల్లంఘించినందుకు ఇండియన్ బ్యాంక్‌కి రూ. 1.62 కోట్ల జరిమానా విధించింది.

ఇక డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్‌లోని నిర్దిష్ట నిబంధనలను పాటించనందుకు గానూ పంజాబ్ & సింధ్‌ బ్యాంక్‌కు రూ. 1 కోటి పెనాల్టీని విధించింది.

నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో మానిటరింగ్ మోసానికి సంబంధించిన ఆదేశాలలో పేర్కొన్న కొన్ని నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు గానూ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు రూ. 8.80 లక్షల జరిమానాను విధించినట్లు ఆర్బీఐ తన ప్రకటనలో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement