మరో 50 పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు? | RBI Rate Hike Alert RBI May Raise Interest Rates by 50 bps by Feb 2027 | Sakshi
Sakshi News home page

మరో 50 పాయింట్లు వడ్డీ రేట్ల పెంపు?

Oct 22 2026 1:19 PM | Updated on Oct 22 2026 1:36 PM

RBI Rate Hike Alert RBI May Raise Interest Rates by 50 bps by Feb 2027

దేశ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రపంచ మార్కెట్ల నుంచి ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్ కీలక వడ్డీ రేట్ల పెంపు బాట పట్టే అవకాశముంది. రాబోయే కొద్ది నెలల్లో అంటే 2027 ఫిబ్రవరి నాటికి రిజర్వ్‌ బ్యాంక్ రెపో రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎమ్‌కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన తాజా నివేదికలో అంచనా వేసింది.

ప్రపంచ వ్యాప్తంగా వడ్డీ రేట్లకు సంబంధించి నెలకొన్న అనిశ్చితులు, దేశీయంగా వినియోగ వస్తువుల ధరలు, ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతుండటం ఆర్‌బీఐపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోత ఉండే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయని, పైగా ద్రవ్యకట్టడి కోసం ఆర్‌బీఐ మరింత కఠిన విధానాలను అవలంబించక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మునుపటి త్రైమాసికాలతో పోలిస్తే రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయుల దిశగా పయనిస్తుండటం, అలాగే కోర్ ద్రవ్యోల్బణ ధోరణులు సెంట్రల్ బ్యాంకును రేట్ల పెంపు వైపు నడిపిస్తున్నాయి ఎమ్‌కే నివేదిక స్పష్టం చేస్తోంది.

మరోవైపు, దేశీయ ఆర్థిక వృద్ధి రేటు పటిష్టంగానే ఉన్నప్పటికీ దిగుమతి వ్యయాలు పెరగడం, ప్రపంచ పరిణామాల కారణంగా ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులో ఉంచడం ఆర్బీఐకి ప్రస్తుతం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రణ, ధరల స్థిరత్వమే లక్ష్యంగా మానిటరీ పాలసీ కమిటీ భేటీల్లో తదుపరి విధాన నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ రేట్ల పెంపు అంచనాలు బాండ్ మార్కెట్లతో పాటు రుణాలు తీసుకునే వారిపై ప్రభావం చూపనున్నాయి.

ఇదీ చదవండి: బంగారం ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement