రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన పసిడి నిల్వలలో నుంచి 35 టన్నుల బంగారాన్ని అమ్మేసినట్లు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కథనాలు విస్తృతంగా వచ్చాయి. ఈ కథనాలను దేశ అత్యున్నత బ్యాంక్ ఖండించింది. ఈ వార్తలపై ఫ్యాక్ట్ చెక్ నిర్వహించిన ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అవన్నీ ఫేక్ అని తేలుస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేయగా దాన్ని ఆర్బీఐ రీ ట్వీట్ చేస్తూ సెంట్రల్ బ్యాంక్ అటువంటి అమ్మకం జరగలేదని స్పష్టం చేసింది.
ఆర్బీఐకి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితమైన వివరాలు, అప్డేట్ల కోసం తమ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచిస్తూ ఆర్బీఐ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసింది.
ప్రపంచంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రధాన కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు, ముఖ్యంగా యూఎస్ డాలర్ నుండి వైవిధ్యపరచడానికి తమ పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. 2022లో రష్యా రిజర్వ్ ఆస్తులను స్తంభింపజేసిన తర్వాత ఈ ధోరణి ఊపందుకుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంకు వద్ద ప్రస్తుతం (2025 సెప్టెంబర్ చివరి నాటికి) 880.8 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి అంచనా విలువ దాదాపు 9 లక్షల కోట్లకు పైనే. వీటిలో 575.8 టన్నులు భారత్లో ఉండగా 290.3 టన్నులు విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వంటి వాటి వద్ద ఉన్నాయి.
Reserve Bank of India, through PIB Fact Check Unit, has debunked claims that 35 tonnes of gold has been sold by RBI from its reserves. https://t.co/8iDYlbO25T
RBI cautions against unsubstantiated rumours on social media. For any information pertaining to RBI, please visit the… pic.twitter.com/A91AIm1Vf3— ReserveBankOfIndia (@RBI) November 7, 2025


