మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్‌ యాప్‌ | Quick Heal Launches Antifraud App In Freemium Model, Check Story Inside | Sakshi
Sakshi News home page

మోసాల నివారణకు.. యాంటీఫ్రాడ్‌ యాప్‌

Jun 1 2025 12:39 PM | Updated on Jun 1 2025 1:43 PM

Quick Heal Antifraud App in Freemium Model

సీమాంతర సైబర్‌ ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో క్విక్‌ హీల్‌ టెక్నాలజీస్‌ తాజాగా మోసాల నివారణ సొల్యూషన్‌ యాంటీఫ్రాడ్‌డాట్‌ఏఐ ఫ్రీమియం వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఫోన్‌లో కనిపించే హానికరమైన యాప్‌లతో పాటు కనిపించకుండా దాక్కునే యాప్‌లను కూడా గుర్తించడం దీని ప్రత్యేకత.

ఫిషింగ్, స్పైవేర్, ఆర్థిక మోసాలపరమైన దాడుల కోసం ఉపయోగించే ఈ హిడెన్‌ యాప్‌లు యూజరుకు తెలియకుండా పని చేస్తాయి. ఇలాంటి యాప్‌ల గురించి యాంటీఫ్రాడ్‌డాట్‌ఏఐ యూజర్లను అలర్టు చేసి, తగు చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుంది.

స్కామ్‌ ప్రొటెక్షన్, రిస్క్‌ ప్రొఫైల్‌ అసెస్‌మెంట్, కాల్‌ ఫార్వార్డింగ్‌.. బ్యాంకింగ్‌ ఫ్రాడ్‌ అలర్ట్, ఫ్రాడ్‌ ప్రొటెక్ట్‌ బడ్డీ మొదలైన ఫీచర్లు ఇందులో ఉంటాయి. దీన్ని ప్రాథమికంగా ఉచితంగా ఉపయోగించుకోవచ్చని, మరింత భద్రత కోరుకునే వారు సబ్‌్రస్కిప్షన్‌ ద్వారా ప్రీమియం వెర్షన్‌ తీసుకోవచ్చని సంస్థ సీఈవో విశాల్‌ సాల్వి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement