అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్‌ అయిపోయింది!

POCO M6 Pro 5G Smartphone Sells Out in 9 Minutes on Flipkart - Sakshi

తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లకు భారత్‌లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్‌ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్‌ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) లాంచ్‌ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్‌ను విడుదల చేసింది. 

ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలి సేల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్‌  మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్‌ను ఆగస్ట్ 12న నిర్వహించింది. 

ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్‌ అయిపోంది. రెండో సేల్‌కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్‌  హిమాన్షు టండన్ ట్విటర్‌లో  షేర్‌ చేశారు. 

పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్  పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఆఫర్‌ ద్వారా రూ.1,000 డిస్కౌంట్‌ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్‌ ఫోన్‌ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్‌ స్పెసిఫికేషన్లు

  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.79 అంగుళాల డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌
  • రెండు ఓఎస్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్
  • ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్
  • 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
  • 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top