దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు‌ | Petrol and Diesel Price Hike Rs 2 in India | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు‌

Published Mon, Apr 7 2025 3:35 PM | Last Updated on Mon, Apr 7 2025 4:06 PM

Petrol and Diesel Price Hike Rs 2 in India

2025 ఏప్రిల్ 8 నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 2 చొప్పున కేంద్రం సోమవారం పెంచింది. ప్రపంచ చమురు ధరలలో కొనసాగుతున్న హెచ్చుతగ్గులు, ట్రంప్ సుంకాల మధ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మంత్రిత్వ శాఖ వెల్లడించిన తన నోటిఫికేషన్‌లో.. పెరిగిన ఎక్సైజ్ సుంకం రిటైల్ ధరలను ఎప్పుడు, ఎలా ప్రభావితం చేస్తుందో వెల్లడించనప్పటికీ.. భారత వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని ధృవీకరించింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలలో ఇటీవల తగ్గింపులతో ఎక్సైజ్ సుంకం పెరుగుదల సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నారు. 

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మార్చి 14న ఇంధన ధరలలో చివరి తగ్గింపు జరిగింది. ఎక్సైజ్ సుంకాన్ని రెండు సార్లు తగ్గించడంతో పెట్రోల్ & డీజిల్ ఎక్సైజ్‌ను లీటరుకు వరుసగా రూ. 13, రూ. 16 చొప్పున తగ్గించారు. 

ఇటీవల చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోల్, డీజిల్ ధరలలో మరింత తగ్గింపు గురించి ఆశావాదం వ్యక్తం చేశారు, ఇది ప్రపంచ ముడి చమురు ధరలు ప్రస్తుత కనిష్ట స్థాయిలో ఉండటంపై ఆధారపడి ఉంటుందని అన్నారు.

	లీటర్కు రూ.2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీ పెంపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement