గ్రూప్ సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌.. ఇదిగో కొత్త స్మార్ట్‌ఫోన్! | OPPO F35 5G Series Launched in India Know The Price Details | Sakshi
Sakshi News home page

గ్రూప్ సెల్ఫీ ఎక్స్‌పర్ట్‌.. ఇదిగో కొత్త స్మార్ట్‌ఫోన్!

Oct 9 2026 9:17 PM | Updated on Oct 9 2026 9:21 PM

OPPO F35 5G Series Launched in India Know The Price Details

ఒప్పో ఇండియా తన ఎఫ్ సిరీస్‌లో భాగంగా కొత్త ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్35 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో కంపెనీ కెమెరా, బ్యాటరీ, పనితీరు, డిస్‌ప్లే వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరా, 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉండటం ఈ సిరీస్‌లో ప్రధాన ఆకర్షణ. గ్రూప్ సెల్ఫీలు తీసుకునేటప్పుడు ఎక్కువ మందిని ఒకే ఫ్రేమ్‌లో ఉంచడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది.

ఒప్పో ఎఫ్35 ప్రో 5జీలో 6.78 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. దీనికి మీడియా టెక్ డిమెన్షిటీ 7360 మ్యాక్స్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. వెనుకవైపు ఓఐఎస్ సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. ముందు, వెనుక కెమెరాలతో 4K వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ఇక ఒప్పో ఎఫ్35 5జీలో 6.57 అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, మీడియా టెక్ డిమెన్షిటీ 6360 మ్యాక్స్ ప్రాసెసర్ ఉన్నాయి.

బ్యాటరీ విషయంలో రెండు ఫోన్లలోనూ 8000mAh భారీ బ్యాటరీ, 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. అలాగే ColorOS 16 ఆధారంగా పనిచేస్తూ ఏఐ రికార్డింగ్, ఏఐ అల్ట్రా క్లియర్ డాక్యుమెంట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి. ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69K రేటింగ్‌లతో నీరు, ధూళి నుంచి రక్షణ కల్పించేలా వీటిని రూపొందించారు. ఒప్పో ఎఫ్35 ప్రోలో అదనంగా 4K వీడియో రికార్డింగ్, 8MP అల్ట్రా వైడ్ వెనుక కెమెరా, డ్యూయల్ స్పీకర్లు ఉన్నాయి.

ధరల విషయానికి వస్తే, ఒప్పో ఎఫ్35 ప్రో 5జీ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.45,999గా ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.49,999కు, 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.54,999కు లభిస్తుంది. ఒప్పో ఎఫ్35 5G 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999 కాగా, 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 2026 అక్టోబర్ 11 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్లు, ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. పండుగ సీజన్ సందర్భంగా ఎంపిక చేసిన బ్యాంక్ ఆఫర్లపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ప్రయోజనాలు కూడా ప్రకటించారు.

ఇదీ చదవండి: ఆర్థిక వృద్ధిలో తైవాన్ టాప్.. భారత్ స్థానం ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement