భారత్‌లో ఓపెన్‌ఏఐ అకాడమీ  | OpenAI launches Academy in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఓపెన్‌ఏఐ అకాడమీ 

Jun 6 2025 1:03 AM | Updated on Jun 6 2025 7:54 AM

OpenAI launches Academy in India

న్యూఢిల్లీ: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్‌ఏఐ, కేంద్ర ఐటీ శాఖలో భాగమైన ఇండియాఏఐ మిషన్‌ కలిసి భారత్‌లో ఓపెన్‌ఏఐ అకాడమీని ప్రారంభించాయి. ఇందుకు అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ)  కుదుర్చుకున్నాయి. దేశీయంగా వేగంగా వృద్ధి చెందుతున్న డెవలపర్ల కమ్యూనిటీ, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, స్టార్టప్‌లు.. ఆవిష్కర్తల నెట్‌వర్క్‌కు ఏఐపరంగా కావాల్సిన విద్యావనరులు, సాధనాలు దీనితో అందుబాటులోకి వస్తాయని ఓపెన్‌ఏఐ తెలిపింది. 

విద్య, టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలనే ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ఇది కీలక ముందడుగని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఈ అకాడమీ లో డిజిటల్, ఇన్‌–పర్సన్‌ లెరి్నంగ్‌ విధానంలో ఇంగ్లీష్, హిందీలో కంటెంట్‌ అందుబాటులో ఉంటుంది. త్వరలో మరిన్ని ప్రాంతీయ భాషలను కూడా జోడించనున్నారు. విద్యార్థులు, డెవలపర్లు, విద్యావేత్తలు, సివిల్‌ సర్వెంట్లు, చిన్న స్థాయి వ్యాపారవర్గాలు మొదలైన వారందరికీ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణనిచ్చేందుకు ఇది ఉపయోగపడనుంది. ఇండియాఏఐ మిషన్‌ ఆమోదించిన 50 ఫెలోస్‌/స్టార్టప్‌లకు 1,00,000 డాలర్ల వరకు విలువ చేసే ఏపీఐ క్రెడిట్స్‌ లభిస్తాయి.  
 

Advertisement
 
Advertisement
Advertisement