ఓలా ఎలక్ట్రిక్‌కి పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు | Ola Electric Receives Rs 73.7 Crore Incentive Under PLI Scheme | Sakshi
Sakshi News home page

ఓలా ఎలక్ట్రిక్‌కి పీఎల్‌ఐ ప్రోత్సాహకాలు

Mar 7 2025 7:51 AM | Updated on Mar 7 2025 8:42 AM

Ola Electric Receives Rs 73.7 Crore Incentive Under PLI Scheme

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ సంస్థలకు సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం (పీఎల్‌ఐ–ఆటో స్కీమ్‌) కింద రూ. 73.74 కోట్లు లభించినట్లు ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలపై ఈ మొత్తం మంజూరు అయినట్లు వివరించింది. దీంతో ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు అందుకున్న తొలి టూ వీలర్‌ ఈవీగా నిల్చినట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వివరించింది.

ఓలా ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్లో 28 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునే క్రమంలో దేశీయంగా ఆటోమోటివ్‌ రంగంలో తయారీని, పర్యావరణ అనుకూల మొబిలిటీ సొల్యూషన్స్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం 2021లో పీఎల్‌ఐ–ఆటో స్కీమ్‌ను ప్రకటించింది. అయిదేళ్ల వ్యవధి కోసం దీనికి రూ. 25,938 కోట్లు కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement