ఎన్‌ఎస్‌డీఎల్‌ లాభం ప్లస్‌  | NSDL reports nearly 5percent rise in Q4 profit to Rs 83.3 crore | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌డీఎల్‌ లాభం ప్లస్‌ 

May 26 2025 5:40 AM | Updated on May 26 2025 5:40 AM

NSDL reports nearly 5percent rise in Q4 profit to Rs 83.3 crore

ముంబై: పబ్లిక్‌ ఇష్యూపై కన్నేసిన నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ(ఎన్‌ఎస్‌డీఎల్‌) గతేడాది చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5 శాతం వృద్ధితో రూ. 83 కోట్లను అధిగమించింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 80 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్‌ ప్రకటించింది. 

కాగా.. మొత్తం ఆదాయం 10 శాతం బలపడి రూ. 394 కోట్లను తాకింది. అంతక్రితం క్యూ4లో రూ. 358 కోట్ల ఆదాయం నమోదైంది. పూర్తి ఏడాదికి(2024–25) నికర లాభం 25 శాతం జంప్‌చేసి రూ. 343 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 12 శాతంపైగా ఎగసి రూ. 1,535 కోట్లయ్యింది. సంస్థ డీమ్యాట్‌ ఖాతాలను నిర్వహించే సంగతి తెలిసిందే. ఐపీవోలో భాగంగా తొలుత 5.72 కోట్ల షేర్లు విక్రయించాలని భావించిన ఎన్‌ఎస్‌డీఎల్‌ ఇటీవల దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లో 5.01 కోట్ల షేర్లకు కుదించింది. ఇష్యూలో స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ, బ్యాంకింగ్‌ దిగ్గజాలు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లను ఆఫర్‌ చేయనున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement