ఈ వారం రెండు ఐపీవోలు | CMR Green Technologies and Hexagon Nutrition are launching their IPOS | Sakshi
Sakshi News home page

ఈ వారం రెండు ఐపీవోలు

Jun 1 2026 4:26 AM | Updated on Jun 1 2026 4:26 AM

CMR Green Technologies and Hexagon Nutrition are launching their IPOS

సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ 

ధరల శ్రేణి రూ. 182–192   

హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ రెడీ 

ధరల శ్రేణి రూ. 42–45 

న్యూఢిల్లీ: వచ్చే వారం ప్రైమరీ మార్కెట్లు సందడి చేయనున్నాయి. సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్, హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానున్నాయి. తద్వారా సంయుక్తంగా రూ. 770 కోట్లవరకూ సమీకరించనున్నాయి. రెండు కంపెనీలు పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో ఇష్యూ చేపట్టనున్నాయి. నాన్‌ఫెర్రస్‌ మెటల్‌ రీసైక్లింగ్‌ కంపెనీ సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్‌ జూన్‌ 3–5 మధ్య పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 182–192కాగా.. తద్వారా రూ. 631 కోట్లు సమీకరించనుంది. 

జూన్‌ 5–9 మధ్య హెక్సగాన్‌..  
జూన్‌ 5–9 మధ్య మైక్రో న్యూట్రియంట్‌ ఫార్ములేషన్ల కంపెనీ హెక్సగాన్‌ న్యూట్రిషన్‌ ఐపీవోకు వస్తోంది. ఇందుకు ధరల శ్రేణి రూ. 42–45కాగా.. తద్వారా రూ. 139 కోట్లు సమీకరించాలని చూస్తోంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రమోటర్లు 3.08 కోట్ల షేర్లు ఆఫర్‌ చేయనున్నారు.    1993లో ఏర్పాటైన ఈ కంపెనీ బ్రాండెడ్‌ న్యూట్రిషన్‌ ప్రొడక్టులను సైతం రూపొందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement