హ్యుందాయ్ లేటెస్ట్ కారు, రేపే లాంచ్‌: డిజైన్‌కి మాత్రం ఫిదా అవ్వాల్సిందే!

New hyundai verna launch details - Sakshi

దక్షిణ కొరియా కార్ బ్రాండ్ హ్యుందాయ్ కొత్త ‘వెర్నా’ సెడాన్ విడుదలకు సర్వం సిద్ధం చేసింది. రేపు మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇప్పటికే కంపెనీ ఈ సెడాన్ కోసం రూ. 25 వేలతో బుకింగ్స్ ప్రారభించింది. ఈ కొత్త మోడల్ దాని మునుపటి మోడల్స్ కంటే భిన్నంగా ఉంది.

(ఇది కూడా చదవండి:  మెగా డీల్‌ జోష్‌: ఎయిరిండియాలో ఉద్యోగాలు, పైలట్‌కు జీతం ఎంతంటే?)

హ్యుందాయ్ వెర్నా సెడాన్ కొత్త డిజైన్ పొందుతుంది. ఇందులో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫుల్ ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లాట్‌గా ఉండే బోనెట్, డోర్స్ మీద క్యారెక్టర్ లైన్స్, స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటివి చూడవచ్చు. వెనుక భాగంలో వెడల్పు అంతటా విస్తరించి ఉండే లైట్ బార్ ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా 1.5 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7 స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో డీజిల్ ఇంజిన్ ఆప్సన్ లేదు. కావున ఇది EX, S, SX, SX (O) ట్రిమ్‌లలో విక్రయించబడుతుంది. ధరలు మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువగా ఉంటాయని అంచనా. ఈ సెడాన్ ధరలు అధికారికంగా రేపు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డిజిటల్ డ్రైవర్స్ డిస్‌ప్లే, బ్రాండెడ్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటిలేటెడ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్స్‌తో పాటు ADAS టెక్నాలజీ ఉంటాయి. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబిడి, రివర్స్ పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో పొందవచ్చు.

కొత్త హ్యుందాయ్ వెర్నా బ్రాండ్ యొక్క సెన్సుయస్ స్పోర్టినెస్ డిజైన్ లాంగ్వేజ్‌ కలిగి ఉండటం వల్ల కొత్తగా దర్శన మిస్తుంది. ఇది చూడటానికి లేటెస్ట్ హ్యుందాయ్ ఎలంట్రా, గ్రాండియర్ సెడాన్ మాదిరిగా ఉంటుంది. ఇది మార్కెట్లో విడుదలైన తరువాత స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top