క్రెడిట్ కార్డ్‌ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు | New Credit Card Rules From 1st September | Sakshi
Sakshi News home page

క్రెడిట్ కార్డ్‌ కొత్త రూల్స్.. రేపటి నుంచే అమలు

Aug 31 2024 7:42 PM | Updated on Aug 31 2024 8:06 PM

New Credit Card Rules From 1st September

సెప్టెంబర్ 1నుంచి వివిధ బ్యాంకులు కొన్ని గణనీయమైన అడ్జెస్ట్​మెంట్స్ చేయనున్నాయి. ఈ ప్రభావం క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్‌లు, చెల్లింపు గడువులు, మినిమమ్ బ్యాలెన్స్‌ వంటి వాటిని ప్రభావితం చేస్తాయి.

రూపే క్రెడిట్ కార్డ్‌
రేపటి నుంచి (సెప్టెంబర్ 1) రూపే క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మెరుగైన రివార్డ్ పాయింట్ సిస్టమ్ నుంచి ప్రయోజనాలను పొందుతారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకారం.. రూపే క్రెడిట్ కార్డ్‌లు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్ల మాదిరిగానే రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు. మొత్తం మీద రూపే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఇకపై ఎక్కువ రివార్డ్ పాయింట్లను పొందవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రివార్డ్ పాయింట్స్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సెప్టెంబర్ 1నుంచి రివార్డ్ పాయింట్లపై కొత్త పరిమితులను ప్రవేశపెడుతుంది. బ్యాంక్ యుటిలిటీ, టెలికామ్ లావాదేవీల నుంచి సంపాదించిన రివార్డ్ పాయింట్లను నెలకు 2000 పాయింట్లకు పరిమితం చేస్తుంది. అయితే క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన లావాదేవీలకు ఎలాంటి రివార్డ్ పాయింట్స్ లభించవు.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లింపు నిబంధనలు
సెప్టెంబర్ 1 నుంచి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ కూడా చెల్లింపులకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయనుంది. చెల్లింపు గడువు తేదీ..  స్టేట్‌మెంట్ జనరేషన్ డేట్ నుంచి (18 నుంచి 15 రోజులకు) కుదించారు. అంటే కార్డు హోల్డర్లు మూడు రోజులు ముందుగానే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే వడ్డీ చార్జీలు కొంత తగ్గించడం జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement