సరికొత్త ఎల‌క్ట్రిక్ సూపర్ బైక్ ను రూపొందించిన విద్యార్థులు

Netherlands Twente University Student Design Delta Ex Electric Superbike - Sakshi

ఎల‌క్ట్రిక్ రేసింగ్ బైక్ ను తయారు చేసిన విద్యార్ధులు 

మూడు సెక‌న్ల‌లో 100కిలోమీట‌ర్ల వేగం

నెదర్లాండ్ కు చెందిన యూనివ‌ర్సిటీ ఆఫ్ ట్వంటెకి చెందిన విద్యార్ధి బృందం ఏడాది పాటు శ్ర‌మించి ఫోర్త్ జ‌న‌రేష‌న్ కు చెందిన డెల్టా ఈఎక్స్ అనే ఎల‌క్ట్రిక్ రేసింగ్ బైక్ ను డిజైన్ చేసింది. విద్యార్ధులు త‌యారు చేసిన ఈ బైక్ డిజైన్ తో పాటు ఫీచ‌ర్స్ ఆక‌ట్టుకోవ‌డంతో రేసింగ్ ప్రియులు ఈ బైక్ ను కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.  

డెల్టా ఇఎక్స్ మోడ‌ల్ రేస్ బైక్ చూడ‌డానికి సుటర్ MMX 500ను పోలి ఉంటుంది. కానీ వాస్త‌వానికి బైక్ ఎత్తు ప‌ల్లాల్లో దాని వేగాన్నిపెంచేందుకు వ‌న్‌ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ను ఉప‌యోగిస్తుంటారు. దీనికి మాత్రం టూ మోటార్ స్ట్రోక్ ఇంజిన్ ఉప‌యోగించారు. అంతేకాదు దాని డిజైన్ ను ( స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌) సైతం 1970ల నుంచి వెహిక‌ల్ రంగంలో అగ్ర‌గామిగా ఉన్న బక్కర్ ఫ్రేమ్‌బౌవ్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో డిజైన్ చేయించారు. ఇక దాని వేగం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే వంద‌ల కిలోమీట‌ర్ల టార్గెట్ ను ఛేదిస్తోంది.170 కిలోవాట్ల పిఎమ్‌ఐసి (పర్మనెంట్ మాగ్నెట్ ఎసి) మోటారుతో పనిచేసే డెల్టా ఈఎక్స్ 300 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది సెక‌న్ల‌లో రీచ్ అవుతుంది. అంటే మూడు సెకన్లకు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

దాని బాడీ పార్ట్స్ ఆక‌ట్టుకునేలా ఉంటాయి. ముఖ్యంగా బైక్ టైర్ వేగాన్ని అదుపు చేసేలా సిరామిక్ రెయిన్ ఫోర్స్ డ్‌ కార్బన్ ట్యూబ్స్‌తో  ఓహ్లిన్స్ ఫోర్క్, బైక్ అప్ అండ్ డౌన్ ను కంట్రోల్ చేసే ఓహెలిన్స్ టీటీఎక్స్ జీపీ మోనో షాక్ స్ప్రింగ్స్‌, బ్రేక్ వేసే స‌మ‌యంలో ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ర‌క్షించేలా యూకేకు చెందిన హెల్ కంపెనీ ఫోర్ పిస్టోన్ ర్యాడైల్ క్లిప్ప‌ర్‌,  ఫోర్జెడ్ అల్యూమినియంతో ఫ్రంట్ వీల్.. పీవీఎం మెగ్నీషియం వెనుక చక్రంతో అమర్చారు. కాగా, ఈ ఎలక్ట్రిక్ సూపర్ బైక్  70కి పైగా భాగస్వామి కంపెనీల సహాయంతో తయారు చేసింది విద్యార్ధుల బృందం.ప్ర‌స్తుతం మోటోజిపి రేస‌ర్ బైక్  త‌ర‌హాలో కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధ‌మైంది.  

చ‌ద‌వండి : హోండా నుంచి ఎలక్ట్రిక్‌ బైక్‌!
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top