సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారిక ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్‌క్రాస్ రేసింగ్ లీగ్ (ISRL) సీజన్–2 రెండో రౌండ్ పోటీలు హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో శనివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి.
బాలీవుడ్ మెగాస్టార్, ISRL బ్రాండ్ అంబాసడర్ సల్మాన్ ఖాన్ ఈ వేడుకకు హాజరై వేదికను కదిలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ఈ వేడుకను అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఈవెంట్‌లో బైకర్ల విన్యాసాలు చూసేందుకు 18,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. దీంతో బాలయోగి స్టేడియం కిక్కిరిసిపోయింది. బైకర్ల వేగం, నైపుణ్యానికి రేసింగ్ అభిమానులు ముగ్దులయ్యారు.
ఈ పోటీల్లో 450cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన ఆంథోనీ బోర్డన్ (BB Racing) విజేతగా నిలిచారు. హోండా CRF 450 R బైకర్‌పై విజయం సాధించారు.
250cc ఇంటర్నేషనల్ క్లాస్ విభాగంలో ఫ్రాన్స్‌కు చెందిన కాల్విన్ ఫోన్‌వియెల్ (Indewheelers Motorsports) యమహా YZ 250పై గెలిచారు.
250cc ఇండియా–ఆసియా మిక్స్ కేటగిరీ విభాగంలో ఇండోనేషియాకు చెందిన నకామి మకరిమ్ (Bigrock Motorsports SX) కవాసకి KX 250పై విజయం సాధించారు.
టీమ్ గుజరాత్ ట్రైల్‌బ్లేజర్స్ రౌండ్–2లో ఓవరాల్ విక్టరీ సాధించింది.
ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూఎస్‌ఏ, జర్మనీ, థాయ్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి 36 మంది అంతర్జాతీయ రైడర్లు, 21 దేశాల ప్రతినిధులు పోటీపడ్డారు. భారత రైడర్లలో రుగ్వేద్ బార్గుజే, ఇక్షన్ షణ్‌భాగ్ ఆకట్టుకున్నారు.
ఈ పోటీల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువతకు ప్రపంచ స్థాయి క్రీడా అవకాశాలు కల్పించడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. ISRL వంటి అంతర్జాతీయ ప్రమాణాల మోటార్‌స్పోర్ట్స్ లీగ్‌లు రాష్ట్రానికి ఉద్యోగాలు, టూరిజం, గ్లోబల్ గుర్తింపు తీసుకొస్తాయని తెలిపారు.
ఇదే సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఎనర్జీ అద్భుతం. భారత, విదేశీ రైడర్లు కలిసి పోటీపడటం చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ISRL యువతకు అద్భుత వేదిక అని అన్నారు.
ఎండీ మరియు ISRL కో ఫౌండర్ వీర్ పటేల్ మాట్లాడుతూ.. కిక్కిరిసిన స్టేడియం, నిరంతర హర్షధ్వానాలు భారత యువతలో మోటార్‌స్పోర్ట్స్ పై ఉన్న ఆసక్తిని సూచిస్తున్నాయని అన్నారు.
ISRL గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21, 2025న కేరళలోని కోజికోడ్ EMS కార్పొరేషన్ స్టేడియంలో జరుగనుంది.


