స్థిరమైన భవిష్యత్ కోసం.. ఎన్ఏసీ, పీఎస్ఐ ఒప్పందం | NAC And PSI Sign MoU for Sustainable Future in Construction | Sakshi
Sakshi News home page

స్థిరమైన భవిష్యత్ కోసం.. ఎన్ఏసీ, పీఎస్ఐ ఒప్పందం

Jul 24 2024 9:26 PM | Updated on Jul 25 2024 9:38 AM

NAC And PSI Sign MoU for Sustainable Future in Construction

మహీంద్రా యూనివర్సిటీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC), ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (PSI)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ రంగంలో స్థిరమైన భవిష్యత్తు కోసం జులై 19న యూనివర్శిటీ ప్రాంగణంలో ఈ అవగాహన ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను మహీంద్రా యూనివర్సిటీ తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది.

ఎన్ఏసీ, పీఎస్ఐ మధ్య జరిగిన ఒప్పంద కార్యక్రమంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ మధుసూధన రెడ్డి, వీసీ డాక్టర్ యాజులు మేడూరి మొదలైనవారు పాల్గొన్నారు.

భారతదేశంలో కన్‌స్ట్రక్షన్ & ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ స్థాయిని సాధించడానికి ఈ ఎమ్ఒయు కీలకమైన దశను సూచిస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని అభివృద్ధి చేయడానికి మేము కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నామని మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ యాజులు మేడూరి అన్నారు.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) డైరెక్టర్ జనరల్ పీ మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. మహీంద్రా యూనివర్సిటీ, ప్రీ-ఇంజనీర్డ్ స్ట్రక్చర్స్ సొసైటీ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఒప్పందం నిర్మాణంలో స్థిరమైన భవిష్యత్తును సూచిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా కొత్త ఆవిష్కరణలకు, అభివృద్ధి చెందుతున్న వాటికి అనుగుణంగా ప్రభావవంతమైన పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement