ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘మిల్లీగ్రామ్‌ గోల్డ్‌ ప్రోగ్రామ్‌’ | Muthoot Finance to launch milligram reward programme | Sakshi
Sakshi News home page

ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘మిల్లీగ్రామ్‌ గోల్డ్‌ ప్రోగ్రామ్‌’

Aug 25 2022 5:33 AM | Updated on Aug 25 2022 5:33 AM

Muthoot Finance to launch milligram reward programme - Sakshi

కొచ్చి: గోల్డ్‌ ఫైనాన్సింగ్‌ దిగ్గజం ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‘మిల్లీగ్రామ్‌ గోల్డ్‌ ప్రోగ్రామ్‌’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ముత్తూట్‌ గ్రూప్‌ వద్ద లావాదేవీలను నిర్వహించే కస్టమర్లకు కనీసం మిల్లీగ్రామ్‌ బంగారం బహుమతిగా అందజేస్తుంది. రిఫరల్‌ లావాదేవీపై 20 మిల్లీగ్రాముల బంగారం పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ ఏప్రిల్‌ 2022 నుంచి నిర్వహించిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుంది.

ఏటా రూ.50 కోట్ల విలువైన(100 కేజీలు) బంగారాన్ని కస్టమర్లకు అందించాలని కంపెనీ భావిస్తోంది. ‘రెండేళ్ల పాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా కస్టమర్లతో మా అనుబంధం మరింత  బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాము. ఎన్నో ఏళ్లుగా వారు మాపై చూపుతున్న అభిమానానికి కృతజ్ఞత ఇది’ అని కంపెనీ ఎండీ జార్జ్‌ అలెగ్జాండర్‌ ముత్తూట్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement