ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్‌లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఉన్నారు.
ఈ కమిషన్‌కి రువాండా అధ్యక్షుడు పాల్ కగామే, సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్‌లు కో–చెయిర్‌గా వ్యవహరిస్తారు. వాస్తవ ప్రపంచపు సవాళ్లను పరిష్కరించడంలో ఏఐ సామర్థ్యాలను వినియోగంలోకి తేవడానికి, దానిపై అవగాహన, నమ్మకాన్ని పెంచడానికి ఈ కమిషన్ పని చేస్తుంది. ఫౌండింగ్ మెంబర్‌గా సునీల్ మిట్టల్‌ని ప్రతిపాదించడంపై భారతి ఎంటర్‌ప్రైజెస్ హర్షం వ్యక్తం చేసింది.


