రొమాంటిక్‌ సాంగ్‌.. ముఖేశ్‌-నీతాల డ్యాన్స్‌ చూశారా? | Mukesh Ambani, Nita Ambani Dance At Anant & Radhika's Pre-Wedding Bash | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌ పాటకు భార్యతో కలిసి డ్యాన్స్‌ చేసిన ముఖేశ్‌ అంబానీ

Published Sat, Mar 2 2024 3:56 PM | Last Updated on Sat, Mar 2 2024 4:16 PM

Mukesh Ambani Nita Ambani Dance on Anant Radhikas Pre Wedding Bash - Sakshi

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పటికే అంగరంగ వైభవంగా మొదలైపోయాయి. ప్రపంచం నాలు మూలాల నుంచి పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో జామ్‌నగర్ మొత్తం సందడిగా మారింది. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ డ్యాన్స్ వేయనున్న.. దానికోసం వారు రీహార్సిల్స్ చేస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెట్టింట్లో వైర్ల అవుతున్న వీడియోలో 'ప్యార్ హువా ఇక్రార్ హువా హై' అనే పాటకు లిప్ సింక్ చేస్తూ.. ట్రెడిషినల్ దుస్తుల్లో ముకేశ్ అంబానీ, నీతా అంబానీ చాలా అద్భుతంగా డ్యాన్స్ వేయడం చూడవచ్చు. కాగా అనంత్, రాధికల పెళ్లి జులై 2024లో జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు.

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మొదలైన 'అనంత్, రాధిక' ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు 1000 మంది సెలబ్రిటీలు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు. వీరి కోసం ఇప్పటికే ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు.

అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు 120 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 1000 కోట్లు) ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రీవెడ్డింగ్‌గా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ఆస్తిలో అది కేవలం 0.1శాతం మాత్రమే అని పలువురు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement