
ఇండియాలో బిజినెస్ ఐకానిక్‌గా ఎదిగి దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ముఖేశ్ అంబానీ పుట్టింది భారత్‌లో కాదు. అంబానీ ఏడెన్(ప్రస్తుతం యెమెన్)లో జన్మించారు. పుట్టిన ఏడాదికే ఇండియా వచ్చి చదువు పూర్తయ్యాక తండ్రితోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించి రూ.కోట్ల రూపాయలు సంపాదించారు.
తాజాగా హురున్ ఇండియా 2025లో అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. చాలా విభాగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న అంబానీ కుటుంబ వ్యాపార విలువ రూ.28.2 లక్షల కోట్లు. ఇది భారతదేశ జీడీపీలో పన్నెండో వంతుగా ఉండడం విశేషం. అయితే ఇంతకీ ముఖేశ్ అంబానీ ఏం చదివారో తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఆ వివరాలు కింద తెలియజేశాం.
పుట్టిన ప్రదేశం: 1957 ఏప్రిల్ 19న ఏడెన్ (ప్రస్తుత యెమెన్)లో జన్మించారు. తర్వాత ఆయన 1958లో కుటుంబంతో భారత్‌కు వచ్చారు. 1950ల్లో ఆయన తండ్రి ధీరూబాయ్ అంబానీ యెమెన్‌లో పని చేస్తుండేవారు. దాంతో ముఖేశ్ అక్కడే జన్మించాల్సి వచ్చింది.
ప్రాథమిక విద్య: గ్వాలియర్‌లోని సింధియా పాఠశాలలో చదివారు.
హైస్కూల్: ముఖేశ్ సోదరుడు అనిల్ అంబానీతో కలిసి ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని హిల్ గ్రాంజ్ హైస్కూల్‌లో సెకండరీ విద్య పూర్తి చేశారు.
సీనియర్ సెకండరీ: ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివారు.
అండర్ గ్రాడ్యుయేషన్: ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు.
పోస్ట్ గ్రాడ్యుయేషన్: స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ ప్రోగ్రామ్‌లో చేరారు. ఒకప్పటి మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీవ్ బామర్ స్టాన్‌ఫోర్డ్‌లో ముఖేశ్ క్లాస్‌మేట్. 1980లో తన తండ్రి ధీరూభాయ్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
ఇదీ చదవండి: తలపై గన్ పెట్టి బెదిరిస్తే ఎలా?