Motorola Envision X 4K QLED TV launched in India; check details - Sakshi
Sakshi News home page

మోటరోలా ఎన్విజన్‌ఎక్స్‌ 4కే టీవీ

Jun 9 2023 8:20 AM | Updated on Jun 9 2023 8:49 AM

Motorola Envision x 4K TV launched and details - Sakshi

బెంగళూరు: ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల సంస్థ మోటరోలా ‘ఎన్విజన్‌ ఎక్స్‌’ పేరుతో 4కే క్యూఎల్‌ఈడీ గూగుల్‌ టీవీని విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై దీన్ని ఆవిష్కరించింది. ఫ్యూచరిస్టిక్‌ డిజైన్, మెరుగైన ఆడియో, వీడియో, గేమింగ్‌ సామర్థ్యాలతో అందుబాటు ధరలకే దీన్ని తీసుకొచ్చినట్టు మోటరోలా తెలిపింది. 

ఎన్విజన్‌ ఎక్స్‌ కింద 55 అంగుళాలు, 65 అంగుళాల స్క్రీన్‌ సైజులతో రెండు మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 55 అంగుళాల ధర రూ. 30,999 కాగా, 65 అంగుళాల ధర రూ. 39,999. ఆరంభ ఆఫర్‌ కింద 55 అంగుళాల టీవీపై రూ.5,000, 65 అంగుళాల టీవీపై రూ. 10,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు మోటరోలా ప్రకటించింది. క్యూఎల్‌ఈడీ డిస్‌ప్లే క్వాంటమ్‌ గ్లో టెక్నాలజీతో ఉంటుందని, రంగులను అద్భుతంగా చూపిస్తుందని, దృశ్యాలు సహజంగా అనిపిస్తాయని తెలిపింది. 3డీ సరౌండ్‌ సౌండ్, డాల్బీ అట్మాస్‌ టెక్నాలజీతో వస్తుందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement