
పెరుగుతున్న ఏఐ వినియోగం
న్యూఢిల్లీ: సెమీకండక్టర్ల తయారీ దిగ్గజం మీడియాటెక్ భారత్‌లో మరిన్ని వ్యాపార అవకాశాలు లభించగలవని భావిస్తోంది. ఏఐ నిపుణుల లభ్యత మెరుగ్గా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలు కృత్రిమ మేథను ఉపయోగించుకోవడంపై ఆసక్తి చూపుతుండటమనేది విక్రయాల వృద్ధికి దోహదపడగలదని ఆశిస్తోంది.
ఏఐ, కొత్త తరం కనెక్టివిటీ సొల్యూషన్స్‌పై దృష్టి పెడుతూ ఆటోమోటివ్ రంగంలో మరింతగా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు మీడియాటెక్ డైరెక్టర్ రీటా వూ తెలిపారు. ఏఐ వినియోగం, హై–పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యాలకు డిమాండ్, తక్కువ విద్యుత్ శక్తితో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడం వంటి అంశాలు పరిశ్రమలో కీలక మార్పులు తెస్తున్నాయని ఆమె తెలిపారు.