ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోకా’ శ్రీనివాస్‌ ఎన్నిక

MD of Sloka elected to Board of Directors of AAAI - Sakshi

హైదరాబాద్‌: అడ్వరై్టజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టరుగా శ్లోకా అడ్వరై్టజింగ్‌ ఎండీ, సీఈవో కె. శ్రీనివాస్‌ తిరిగి ఎన్నికయ్యారు. డైరెక్టర్ల బోర్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండోసారి ఎవరైనా ఎన్నికవడం ఇదే ప్రథమం. అడ్వరై్టజింగ్, మార్కెటింగ్‌లో శ్రీనివాస్‌కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది.

డైరెక్టర్ల బోర్డుకు మరోసారి ఎన్నికవడంపై శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ వ్యాపార విధానాలు అమలయ్యేలా చూసేందుకు బోర్డు సభ్యులతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా గ్రూప్‌ ఎం మీడియా సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్‌ కుమార్‌ మరోసారి ఎన్నికయ్యారు. అలాగే, హవాస్‌ మీడియాకు చెందిన రాణా బారువా ఏకగ్రీవంగా వైస్‌–ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top