breaking news
K. srinivas
-
పత్రికా స్వేచ్ఛ అణచివేత.. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
సాక్షి, హైదరాబాద్: పత్రికాస్వేచ్ఛను హరిస్తూ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయడంపై సీనియర్ సంపాదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టు సమాజమంతా ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మీడియాపై ప్రభుత్వాలు చేస్తున్న ఒత్తిడి, అణచివేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యలపై స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని తీవ్ర పరిణామాలను మీడియా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ‘ప్రజాస్వామ్యం– పత్రికాస్వేచ్ఛ’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.సీనియర్ జర్నలిస్టు ఆర్.దిలీప్ రెడ్డి ఈ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘ప్రభుత్వాలు జర్నలిస్టులను భయపట్టేలా వ్యవహరిస్తున్నాయి. కొమ్మినేని శ్రీనివాస రావు కించపరిచే వ్యాఖ్యలు చేయకపోయినా ఆయనను అరెస్టు చేయడం అన్యాయం. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది’ అని సీనియర్ సంపాదకులు అన్నారు.ఇటీవల ఏపీలో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఇటీవల సంపాదకుడు రహమాన్‌పై కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్‌రావు, ట్రెజరర్ రాజేష్, సభ్యులు బాపూరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సంపాదకులు వ్యక్తపర్చిన అభిప్రాయాలు వారి మాటల్లోనే... - కె.రామచంద్రమూర్తి ,సీనియర్ సంపాదకులుపత్రికా స్వేచ్ఛను కోరుకునేది ప్రజలే.. పత్రికా స్వేచ్ఛ అనేది ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదు. దీన్ని ప్రధానంగా కోరుకునేది ప్రజలే. పత్రికలు చురుకుగా ఉన్నప్పుడే ప్రతీ విషయం ప్రజలకు చేరుతుంది. కానీ ప్రస్తుతం ప్రతికాస్వేచ్ఛ ప్రమాదంలో పడింది. కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ ఏకంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించడం చూస్తుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో స్పష్టమవుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గత 40 ఏళ్లుగా ఏ వర్గాన్నీ గౌరవించిన మనిషి కాదు. ప్రతీ రంగంలో తన వ్యతిరేకులను అణచివేయడం ఏళ్లుగా చూస్తున్నాం. ప్రస్తుతం ప్రతికా స్వేచ్ఛనే కాదు... అన్ని స్వేచ్ఛలు హరించుకుపోతున్నాయి. నియంత పాలన మాదిరిగా ప్రభుత్వాలను నిర్వహిస్తున్నారు. - టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులుమీడియాను భయపెట్టే ప్రయత్నమిది.. కొమ్మినేని అరెస్టుతో మీడియాను భయపెట్టే ప్రయత్నం జరుగుతోంది. కొమ్మినేని తప్పు లేకు న్నా.. ఒకరకమైన భయం కలిగించే వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉండే వార్తలే రాయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మీడి యా స్వతంత్రంగా లేదు. రాజకీయ పారీ్టల మద్దతుతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయినప్పటికీ పాత్రికేయులు తమ పరిమితులకు లోబడి వాస్తవాలను మాత్రమే రాయాలి. పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వా మ్యం రెండూ వేర్వేరు కాదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కొమ్మినేని అరెస్ట్‌తో ఆగుతుందని అనుకోవడం లేదు. దీంతో భయపడి మిగతావారు వ్యతిరేక వార్తలు రా యకుండా ఉంటారని అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మిగతా జర్నలిస్టులు రియాక్ట్ కాకుంటే ఎలా..? - దేవులపల్లి అమర్ ,సంపాదకులు మన తెలంగాణకక్ష సాధింపునకు పరాకాష్ట సాక్షి టీవీ డిబెట్లో కొమ్మినేని శ్రీనివాసరావు అనని మాటలకు ఆయన్ను అరెస్టు చేయడం సరికాదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానాలి. కొమ్మినేని అరెస్టే సరి కాదని న్యాయస్థానం స్పష్టంచేస్తుంటే, సాక్షి కార్యాలయాలపై దాడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సరైన కారణం లేకుండా ఎవరినైనా అరెస్టు చేయొచ్చని, ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చనే తప్పుడు సంప్రదాయానికి తెరతీసింది. ఇది రాబోయే రోజుల్లో పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగించనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. - ఆర్.ధనంజయ రెడ్డి, ఎడిటర్, సాక్షిఒక్కో మీడియా ఒక్కో వైఖరితో.. ప్రస్తుత రోజుల్లో ఒక్కో మీడియా ఒక్కో వైఖరితో ఉంది. ఈ పరిస్థితుల్లో ఐదు పేపర్లు, పది టీవీ చానళ్లు చూస్తే తప్ప వాస్తవాలేంటో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అరెస్టు చేస్తుంటే... ఇక్కడ రేవంత్ ప్రభుత్వం ఏకంగా అసెంబ్లీలోనే గుడ్డలూడదీసి కొడతానంటోంది. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి అరెస్టులను వ్యతిరేకించాలి. అల్లం నారాయణ, సీనియర్ సంపాదకులుపాత్రికేయుల భద్రత గురించి ఆలోచించాలి రాజకీయ కక్ష సాధింపులో మీడియా పావులుగా మారుతోంది. ఏపీ, తెలంగాణ అనే కాదు.. చాలా రాష్ట్రాల్లో మీడియా టార్గెట్ అవుతోంది. ఈ పరిస్థితుల్లో పాత్రికేయుల భద్రత గురించి ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సమాచా రం అందించే ఏ వ్యవస్థ అయినా మీడియా కిందనే గుర్తించాలి. ఓ వార్త విషయంలో ప్రైవేటు వ్యక్తులు కేసు పెడితే నాపై కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపెట్టి అరెస్టు చేశారు. ఇదివరకు సోషల్ మీడియా వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ప్రధాన స్రవంతి మీడియా పెద్దలు పట్టించుకోలేదు. ఇప్పుడది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వచ్చింది. కొమ్మినేని అరెస్టుతో ఎంతపెద్ద జర్నలిస్టునైనా అరెస్టు చేస్తామనే అభిప్రాయాన్ని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లింది. - కె.శ్రీనివాస్, సీనియర్ సంపాదకులుసుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినా కొన్ని మీడియా సంస్థలు వెక్కిరిస్తున్నాయి కొమ్మినేని అరెస్టు... సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన తీరు ఏపీ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. కొన్ని మీడియా సంస్థలు జర్నలిజం విలువలను దిగజార్చుతున్నాయి. కొమ్మినేని అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. కొమ్మినేని నవ్వితే అరెస్టు చేయడాన్ని కక్ష సాధింపుగా కోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు సూచనలపై కొందరు వ్యంగ్యంగా చర్చిస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు సెక్షన్లు తెలియకుండా చర్చలు పెట్టేస్తున్నారు. ఇది మీడియా ఉనికికే ప్రమాదకరం. - విజయ్ బాబు,సీనియర్ సంపాదకులుపత్రికలకు స్వేచ్ఛ లేదు ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే పత్రికలకు స్వేచ్ఛ ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినా.. వార్త రాసినా ఉపేక్షించే పరిస్థితిలో లేవు. అందుకు తాజా ఉదా హరణ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు వ్యవహారమే. వాస్తవానికి ఆయనను అరెస్టు చేయడం సమంజసం కాదు. - దిలీప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్..అయినా ప్రజా ప్రయోజన వార్తలు ఆగవు గద్వాల జిల్లాలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు చేస్తారనే స్థానికుల సమాచారంతో నేను వార్తలు రాశాను. ఇథనాల్ పరిశ్రమ అత్యంత ప్రమాదకరమైంది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నన్ను అరెస్టు చేసింది. అయినా ప్రజలకు ప్రయోజనం కలిగించే వార్తలు రాయడం ఆపను. - రహమాన్, సంపాదకులుకలిసి ఉంటేనే మనుగడవ్యవస్థలో అన్ని రంగాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే ఉంటున్నాయి. దీంతో జర్నలిస్టులను అకారణంగా టెర్రరిస్టుల మాదిరిగా అరెస్టు చేసి వారికి బెయిల్ రాకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టు సమాజమంతా కలిసికట్టుగా ఉంటేనే మీడియా మనుగడ ఉంటుంది. - శైలేష్ రెడ్డి, సీఈఓ, టీ న్యూస్ -
ఏఏఏఐ డైరెక్టరుగా ‘శ్లోకా’ శ్రీనివాస్ ఎన్నిక
హైదరాబాద్: అడ్వరై్టజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టరుగా శ్లోకా అడ్వరై్టజింగ్ ఎండీ, సీఈవో కె. శ్రీనివాస్ తిరిగి ఎన్నికయ్యారు. డైరెక్టర్ల బోర్డుకు తెలుగు రాష్ట్రాల నుంచి వరుసగా రెండోసారి ఎవరైనా ఎన్నికవడం ఇదే ప్రథమం. అడ్వరై్టజింగ్, మార్కెటింగ్‌లో శ్రీనివాస్‌కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది. డైరెక్టర్ల బోర్డుకు మరోసారి ఎన్నికవడంపై శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ వ్యాపార విధానాలు అమలయ్యేలా చూసేందుకు బోర్డు సభ్యులతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఏఏఏఐ ప్రెసిడెంట్‌గా గ్రూప్ ఎం మీడియా సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. అలాగే, హవాస్ మీడియాకు చెందిన రాణా బారువా ఏకగ్రీవంగా వైస్–ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. -
మా కల సాకారమయ్యేదెన్నడు?
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలకుపైగా ఎదురుచూస్తున్న తమ కల సాకారం చేయాలని 1998 డీఎస్సీ అర్హులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 1500 మంది అభ్యర్థులు సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయం కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని నిరీక్షిస్తున్నారు. న్యాయం చేస్తామని ఉద్యమ సమయంలోనూ, సీఎం అయిన తర్వాత కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని ‘1998 డీఎస్సీ సాధన సమితి’ రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అభ్యర్థులకు న్యాయం చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇచ్చిందని, దీంతో తమకూ కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాలు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంటాడుతున్న శాపం 1998లో చంద్రబాబు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. తొలుత జారీ చేసిన జీవో–221లో రాత పరీక్షకు కటాఫ్ మార్కులు ఓసీకి 50, బీసీకి 46, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు 40లను నిర్ణయించారు. ఇంటర్వ్యూలకు పిలిచేందుకు కొన్ని కేటగిరీల్లో సరిపోను అభ్యర్థులు లేరనే సాకుతో కటాఫ్ మార్కులను తగ్గిస్తూ జీవో 618 జారీచేశారు. ఈ జీవోలను ఆసరాగా చేసుకుని కొంతమంది అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు దండుకున్నారు. 221 జీవో కింద అర్హత సాధించిన మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వేశారనే ఫిర్యాదులొచ్చాయి. 618 జీవో కింద అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడంతో మెరిట్ సాధించిన అభ్యర్థులు రోడ్డున పడ్డారు. బాధితులు 24 సంవత్సరాల పోరాడుతున్నారు. సూత్రప్రాయ అధికారిక ప్రకటన ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో తెలంగాణ భవన్లో అభ్యర్థులతో చర్చలు కూడా జరిపారు. వారికి పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అప్పట్లో విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మీడియా సమావేశంలోను, అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రభుత్వం తరపున అధికారిక ప్రకటన చేశారు. తరువాత ముందడుగు పడలేదు. ఏపీ íసీఎం జగన్, ఆ రాష్ట్రానికి చెందిన డిఎస్సీ 98 క్వాలిఫైడ్స్‌కు ఉద్యోగాలు ఇచ్చారని, వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసుగా పరిగణించి న్యాయం చేస్తానన్న సీఎం కేసీఆర్ కూడా మాట నిలబెట్టుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించైనా ఆదుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆ దిశగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడిని నిరసించండి: ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే పిలుపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘ది హిందూ’ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ నగేష్ కుమార్ తదితర జర్నలిస్టులపై పెట్టిన కేసులను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణించి మీడియా సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (హెచ్‌యూజే) పిలుపునిచ్చాయి. సోమవారం ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, హెచ్‌యూజే ఆధ్వర్యంలో ప్రజాశక్తి ఎడిటర్ తెలకపల్లి రవి అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితిని ఆసరాగా తీసుకొని పోలీసులు మీడియాపై వేధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 10టీవీ చైర్మన్, ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే పత్రికా స్వేచ్ఛ వచ్చింది తప్ప డీజీపీ దయాదాక్షిణ్యాలతో కాదని ధ్వజమెత్తారు. నగేష్ కుమార్‌ను ఇంటికివెళ్లి మరీ పోలీసులు వేధించాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నిస్తున్నానని తననూ అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు. టైమ్స్ దినపత్రిక ఎడిటర్ కింగ్ షుక్నాగ్ మాట్లాడుతూ నగేష్‌పై దాడిని చూస్తే పోలీస్ రాజ్యం నడుస్తున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఎన్టీవీ చీఫ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ బోఫోర్స్, జయలలిత వ్యవహారాల్లో సుదీర్ఘ పోరాటం చేసిన హిందూ పత్రిక విలేకరిపై పోలీసులు పిచ్చి కేసులు పెట్టి పరువు తక్కువ పనిచేశారని విమర్శించారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ అల్లం నారాయణ మాట్లాడుతూ తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత సీఎం మూడుసార్లు మాత్రమే ప్రజాజీవితంలో కనిపించారన్నారు. పోలీసుల తీరు రాబోయే ప్రమాదానికి సంకేతంగా భావించాలని, పాత్రికేయ ప్రపంచం ముక్త కంఠంతో ఖండి ంచాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు రాజేంద్ర, గంగాధర్ (సాక్షి), నరసింహారెడ్డి (ఈనాడు), ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ర్ట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బసవపున్నయ్య, జి.ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య, అమరయ్య, హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు ఆనందం, నర్సింగ్‌రావు పాల్గొన్నారు. ‘ఆప్నా’ ఖండన: ‘ది హిందూ’ జర్నలిస్టు నగేష్‌కుమార్‌పై క్రిమినల్ కేసులు బనాయించడాన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్‌పేపర్స్ అసోసియేషన్ (ఆప్నా) ఒక ప్రకటనలో ఖండించింది. ఈ ఘటన రాష్ట్రంలో మీడియా కార్యకలాపాల్లో పోలీసులు చేయి పెట్టడమేనని, ఇది అనవసర జోక్యమని సంఘ కార్యదర్శి ఐ.వెంకట్ పేర్కొన్నారు.