2025 ఆటో ఎక్స్‌పోలో ‘ఈ–విటారా’ | Maruti Suzuki Unveils eVitara: Its First Born Electric SUV Ahead Of Launch | Sakshi
Sakshi News home page

2025 ఆటో ఎక్స్‌పోలో ‘ఈ–విటారా’

Dec 22 2024 1:16 AM | Updated on Dec 22 2024 7:48 AM

Maruti Suzuki Unveils eVitara: Its First Born Electric SUV Ahead Of Launch

మారుతీ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ వచ్చే ఏడాది (2025) జరగబోయే భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో తమ తొలి ఎలక్ట్రిక్‌ కారు ఈ–విటారాను ప్రదర్శించే ప్రణాళికల్లో ఉంది. ఇటీవలే దీన్ని ఇటలీలో ఆవిష్కరించింది. వాహన రంగంలో దశాబ్దాల అనుభవంతో అధునాతన ఎలక్ట్రిక్‌ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని రూపొందించినట్లు మారుతీ సుజుకీ ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) పార్థో బెనర్జీ తెలిపారు. 

మరోవైపు, సమగ్రమైన ఎలక్ట్రిక్‌ వాహనాల వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మారుతీ సుజుకీ డీలర్‌íÙప్‌లు, సరీ్వస్‌ టచ్‌ పాయింట్లలో ఫాస్ట్‌ చార్జర్ల నెట్‌వర్క్, హోమ్‌ చార్జింగ్‌ సొల్యూషన్స్‌ మొదలైనవి వీటిలో ఉంటాయని వివరించారు. సరైన చార్జింగ్‌ మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి పెద్ద అవరోధంగా ఉంటోందని బెనర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఈవీలను మ రింత అదుబాటులోకి తెచ్చేందు కు, విస్తృత స్థాయిలో కస్టమర్లకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement