మార్కె‍ట్లకు అమ్మకాల దెబ్బ.. | Market weaken -Psu Banks down | Sakshi
Sakshi News home page

మార్కె‍ట్లకు అమ్మకాల దెబ్బ..

Dec 15 2020 10:02 AM | Updated on Dec 15 2020 10:23 AM

Market weaken -Psu Banks down - Sakshi

ముంబై, సాక్షి: రెండు రోజుల వరుస ర్యాలీకి మరోసారి బ్రేక్‌ పడింది. ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు నీరసంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 236 పాయింట్లు క్షీణించి 46,017కు చేరింది. నిఫ్టీ సైతం 65 పాయింట్లు తక్కువగా13,493 వద్ద ట్రేడవుతోంది. సోమవారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో వెనకడుగు వేయడంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 45,966 వద్ద, నిఫ్టీ 13,479 దిగువన కనిష్టాలకు చేరాయి. 

రియల్టీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియల్టీ 0.7 శాతం స్థాయిలో నీరసించగా.. ఫార్మా, ఆటో 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, యాక్సిస్‌, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, బీపీసీఎల్‌, ఐవోసీ, కోల్‌ ఇండియా, ఆర్‌ఐఎల్‌, ఎస్‌బీఐ 2-1.3 శాతం మధ్య క్షీణించాయి. అయితే ఐషర్, బజాజ్‌ ఆటో, అల్ట్రాటెక్‌, శ్రీ సిమెంట్, ఎంఅండ్‌ఎం, దివీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.7-0.6 శాతం మధ్య బలపడ్డాయి. (కోవిడ్‌-19లోనూ.. దేశీ కుబేరులు భళా)

కెనరా బ్యాంక్‌ డౌన్‌
డెరివేటివ్స్‌లో కెనరా బ్యాంక్‌ 6.6 శాతం పతనంకాగా.. భెల్‌, ఎంజీఎల్‌, పీఎన్‌బీ, పీఎఫ్‌సీ, వేదాంతా, ఐడియా, ఐబీ హౌసింగ్, ఫెడరల్‌ బ్యాంక్‌ 2.3-1.8 శాతం మధ్య వెనకడుగు వేశాయి. కాగా.. మరోపక్క లుపిన్‌, టొరంట్‌ ఫార్మా, హావెల్స్‌, జీ, పేజ్‌, బయోకాన్‌  2.3-1.2 శాతం మధ్య ఎగశాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2 శాతం చొప్పున క్షీణించాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,282 నష్టపోగా..989 లాభాలతో కదులుతున్నాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,264 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,721 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం ఎఫ్‌పీఐలు రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,359 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

Advertisement
 
Advertisement
Advertisement