తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర | LPG Price Cut 19 Kg Cylinder Cheaper By Rs 14 50 From May 1 | Sakshi
Sakshi News home page

తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

May 1 2025 5:05 PM | Updated on May 1 2025 5:40 PM

LPG Price Cut 19 Kg Cylinder Cheaper By Rs 14 50 From May 1

వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింది. 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను రూ .14.50 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. తగ్గించిన కొత్త ధర మే 1 నుండి అమలులోకి వస్తుంది. మార్కెట్లో అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో గ్యాస్‌ ధర తగ్గడం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.

రేట్ల తగ్గింపు తరువాత, ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ .1,747.50 వద్ద ఉంది. ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో సవరించిన ధరలు ముంబైలో రూ .1,699, కోల్‌కతాలో రూ .1,851.50, చెన్నైలో రూ .1,906, హైదరాబాద్‌లో 1,969 వద్ద ఉ‍న్నాయి. స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు వంటి కారకాల వల్ల ఎల్‌పీజీ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు.

గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్‌, వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు సాధారణంగా ప్రతి నెలా మొదటి రోజున సర్దుబాటు చేస్తుంటారు. ఈ మార్పు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. డొమెస్టిక్‌ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత నెలలో డొమెస్టిక్‌ సిలిండర్లపై రూ.50 పెరిగింది. రోజువారీ కార్యకలాపాల కోసం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారులకు ఈ తగ్గింపు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement