వోటథాన్ యాప్‌ ప్రారంభించిన లెట్స్‌వోట్ - వచ్చే వారంలో వాకథాన్‌ కూడా..

LetsVotes Digital Democracy Votathon App Storybox Walkathon Details - Sakshi

Digital Democracy Votathon App: ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లాభాపేక్షలేని పౌర సమాజ సంస్థ లెట్స్‌వోట్ 'డిజిటల్ డెమోక్రసీ వోటథాన్' యాప్‌ను విడుదల చేసింది. ఈ నెల 25న (నవంబర్ 25) గచ్చిబౌలి స్టేడియంలో 'స్టోరీబాక్స్'ను ఆవిష్కరించడమే కాకుండా ఓటు హక్కు, ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు 'వాకథాన్‌'ను నిర్వహించనున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

డిజిటల్ డెమోక్రసీ వోటథాన్ యాప్
ఓటు హక్కుపై అవగాహన కల్పించడానికి.. ఓటు ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి వోటథాన్ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పౌరులు 'లైఫ్ సైకుల్' (Lifecykul) యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పాల్గొనటానికి వోటథాన్ విభాగానికి వెళ్లాలి. ఆ తరువాత ఓటింగ్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి వాకింగ్ లేదా సైక్లింగ్ చేయడం ప్రారంభించవచ్చు. ప్రతి సెషన్ ముగిసే సమయానికి వినియోగదారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించారో ఖచ్చితంగా తెలుసుకుంటారు.

స్టోరీబాక్స్
స్టోరీబాక్స్ అనేది కంటెంట్ అందించే ఒక వినూత్న ఆలోచన. యువ పాఠశాల విద్యార్థులను చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు, కాబట్టి ఓటు హక్కు గురించిబ తెలుసుకుంటారు. అదే సమయంలో పెద్దలను ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రేరేపిస్తారు.
 
లెట్స్‌వోట్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కంటెంట్‌ను ప్రారంభించింది. వివిధ పాఠశాలల యాజమాన్యాలతో కలిసి పనిచేయడం కూడా మొదలు పెట్టింది. ప్రస్తుతం 25 పాఠశాలల్లో ప్రారంభమైన ఈ స్టోరీబాక్స్ కంటెంట్ 40 పాఠశాలలకు చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. స్టోరీబాక్స్ మీద ఆసక్తి ఉన్న యాజమాన్యం స్టోరీబాక్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి లెట్స్‌వోట్ టీమ్‌ను సంప్రదించవచ్చు.
 
వాకథాన్
వచ్చే శనివారం (నవంబర్ 25) రోజు ఓటుపై అవగాహన పెంచేందుకు లెట్స్‌వోట్ ద్వారా తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ భాగస్వామ్యంతో వాకథాన్ నిర్వహించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 6:30 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.

ఈ వాకథాన్‌లో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, మొదటిసారి ఓటు వేయనున్న ఓటర్లు, సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు సుమారు 4000 కంటే ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందని ఓటు వేద్దాం జాతీయ కన్వీనర్ డాక్టర్ కె సుబ్బరంగయ్య అన్నారు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

ఓటరు అవగాహన కోసం నిరవహించే ఈ వాకథాన్‌లో వేసే ప్రతి అడుగు ఒక బలమైన ప్రజాస్వామ్యం నిర్మించడంలో ఉపయోగపడుతుంది. కొత్త ఓటర్లు.. అనుభవజ్ఞులైన వారితో చేతులు కలపడం ఇక్కడ జరుగుతుంది. కేవలం మన ఓటు వేయడమే కాకుండా.. భవిష్యత్తును రూపొందించడానికి కూడా ఇది ఒక మంచి వేదికగా అవుతుందని లెట్స్‌వోట్‌ పబ్లిసిటీ కన్వీనర్‌ షీలా పనికర్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top