కావ్యా మారన్‌-అనిరుధ్‌ వివాహం.. ఇద్దరి వ్యాపార సామ్రాజ్యాలు! | Kavya Maran Anirudh Ravichander Wedding Buzz Business Empire | Sakshi
Sakshi News home page

కావ్యా మారన్‌-అనిరుధ్‌ వివాహం.. ఇద్దరి వ్యాపార సామ్రాజ్యాలు!

Oct 17 2026 11:43 AM | Updated on Oct 17 2026 12:05 PM

Kavya Maran Anirudh Ravichander Wedding Buzz Business Empire

AI Generated image

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్యా మారన్‌ల వివాహం నిశ్చయమైంది. 2026 నవంబరులో వీరి వివాహం జరగనున్నట్లు అధికారిక సమాచారం. అయితే, ఈ వార్తల నేపథ్యంలో వారి వ్యక్తిగత సంపద, కంపెనీల యాజమాన్యం, షేర్‌హోల్డింగ్‌ వివరాలను కింద చూద్దాం.

కావ్యా మారన్‌.. మీడియా నుంచి క్రికెట్‌ వరకు

సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి మారన్‌, కావేరి కళానిధి దంపతుల కుమార్తె కావ్యా మారన్‌. ఆమె సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కార్యకలాపాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్‌ మీడియా, ఓటీటీ, క్రీడా జట్టు నిర్వహణలో ఆమెకు ప్రాధాన్యం ఉంది.

సన్‌ గ్రూప్‌ వ్యాపారం టెలివిజన్‌ ఛానళ్లకే పరిమితం కాదు. రేడియో, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, డీటీహెచ్‌ సేవలు, సినీ నిర్మాణం వంటి విభాగాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ పరిధిలోని సన్‌ పిక్చర్స్‌ సినిమాలను నిర్మిస్తుంది. సన్‌ గ్రూప్‌ అధికారిక సమాచారం ప్రకారం, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా ఈ వ్యాపార సమూహంలో భాగమే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఐపీఎల్‌ జట్టుతో పాటు, దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్‌ కేప్‌, ఇంగ్లండ్‌ హండ్రెడ్‌ పోటీల్లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ఫ్రాంచైజీలతోనూ ఈ వ్యాపార సమూహం అనుబంధం కలిగి ఉంది.

అనిరుధ్‌.. సంగీతమే కాదు, సొంత బ్రాండ్‌ కూడా..

తమిళం, తెలుగు సహా పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన అనిరుధ్‌ రవిచందర్‌ 2026 ఫిబ్రవరిలో అల్బుకెర్కీ రికార్డ్స్‌ (Albuquerque Records) పేరుతో సొంత మ్యూజిక్‌ లేబుల్‌ను ప్రారంభించారు. తన సంగీతంతో పాటు కొత్త కళాకారుల సంగీతాన్ని విడుదల చేస్తున్నారు. 2026లో చర్మసంరక్షణ బ్రాండ్‌ ‘డీకన్‌స్ట్రక్ట్‌’తో భాగస్వామిగా చేరినట్లు వార్తలు వెలువడ్డాయి. అపోలో హాస్పిటల్స్‌ ప్రో హెల్త్‌ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా ఆయనను సంస్థ ప్రకటించింది.

ఇదీ చదవండి: ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నా ఆస్తి ఇవ్వాలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement