హీరో మోటోకార్ప్.. దేశీయ విఫణిలో 2026 ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైకును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.27 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది స్టాండర్డ్, ప్రో, కార్బన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ప్రో, కార్బన్ వేరియంట్ల డెలివరీలు నవంబర్ 1, 2026 నుంచి ప్రారంభమవుతాయి. స్టాండర్డ్ వేరియంట్ జనవరి 2027 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
2026 హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి కొంత అప్డేట్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఇది కొత్త రంగులలో కూడా లభిస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ ఫైర్స్టార్మ్ రెడ్, పెర్ల్ బ్లాక్ రంగులలో.. ప్రో వేరియంట్ ప్రో రెడ్, ప్రో బ్లాక్ రంగులలో లభిస్తుండగా, కార్బన్ వేరియంట్ కార్బన్ రెడ్, కార్బన్ బ్లాక్, కార్బన్ గ్రే, అబ్రాక్స్ ఆరెంజ్ రంగులలో లభిస్తుంది.
మూడు వేరియంట్లలోనూ 164.32 సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది 8750 rpm వద్ద 17.1 హార్స్ పవర్, 6500 rpm వద్ద 14.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, మెకానికల్ థ్రాటిల్, సింగిల్ ఛానల్ ఏబీఎస్తో కూడిన డ్యూయల్ డిస్క్ బ్రేకులు, ఒక ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తాయి. 2026 హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ 4వి బైక్.. దేశీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు షాక్.. బంగారం ధరల్లో మార్పు!


